జగన్ వెంట వెళ్ళేది వందమందేనా ?

చిత్తూరు జిల్లా బంగారుపాళెం పర్యటన ఈ నెల 9న చేపట్టనున్నారు. ఆరు నూరు అయినా జగన్ ఆ రోజున వెళ్ళి తీరుతారని వైసీపీ కీలక నేతలు చెప్పాక పోలీసులు కూడా అనేక షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు.;

Update: 2025-07-08 03:34 GMT

చిత్తూరు జిల్లా బంగారుపాళెం పర్యటన ఈ నెల 9న చేపట్టనున్నారు. ఆరు నూరు అయినా జగన్ ఆ రోజున వెళ్ళి తీరుతారని వైసీపీ కీలక నేతలు చెప్పాక పోలీసులు కూడా అనేక షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేశారు. జగన్ పర్యటనలో కేవలం అయిదు వందల మంది మాత్రమే పాల్గొనాలని ప్రధానమైన షరతు ఉంది.

ఇక జగన్ వెళ్ళాల్సిన బంగారుపాళేనికి ముప్పయి మందికి మాత్రమే అనుమతిస్తున్నారు. అక్కడ అంతా ఇరుకుగా ఉంటుంది అన్న ఆలోచనతో అలా చేస్తున్నామని చెబుతున్నారు. జగన్ కి హెలిపాడ్ వద్ద స్వాగతం పలడానికి కూడా ముప్పై మందినే అనుమతించారు. ర్యాలీలు ఊరేగింపులు వంటివి లేకుండా జగన్ పర్యటన కేవలం పరామర్శగానే ముగించాలని సూచించారు.

అయితే జగన్ చాలా కాలానికి చిత్తూరు జిల్లా టూర్ కి వస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆయన ఎన్నికల్లో ఓటమి తరువాత తొలిసారి వస్తున్నారు. దాంతో ఆయన రాక కోసం చూస్తున్న వైసీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున పోగు అవుతారని అంటున్నారు.

మరో వైపు పోలీసుల షరతులను వైసీపీ నేతలు మామూలుగా తీసుకుని పాటిస్తే మంచిదే. అలా కాకుండా సవాల్ గా తీసుకుంటేనే ఇబ్బంది వస్తుందని అంటున్నారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ళ లో కూడా వంద మందిని మాత్రమే పాలు పంచుకోవాలని కోరారు. కానీ జగన్ వచ్చే సమయానికి పెద్ద ఎత్తున జనాలు వచ్చారు.

మరి ఈసారి కూడా అలాగే జరిగితే పోలీసులు ఏమి చేస్తారు అన్నది ఒక చర్చగా ఉంది. మరో వైపు చూస్తే జగన్ బందోబస్తు విషయంలో పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు జనాలు క్రౌడ్ పెరిగితే ఏ విధంగా హ్యాండిల్ చేయగలరు అన్నది కూడా ప్రశ్నగా ఉంది.

ఏది ఏమైనా జగన్ పర్యటనలు ఇటీవల వివాదాలు అవుతున్నాయి. రాజకీయం కాకను కూడా రేపుతున్నాయి. పోలీసులు వర్సెస్ వైసీపీగా మారుతున్నాయి. ఇక్కడ ఎవరూ తగ్గడం లేదు. పరామర్శలు ఓదార్పులకు వేలాది మంది జనాలను తోలి మరీ హంగామా చేయడం అవసరమా అని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయ మంత్రి అయితే జగన్ హయాంలోనే రైతులకు అన్యాయం జరిగిందని ఆయన పరామర్శకు వస్తే కనుక రైతులే నిలదీయాలని కోరుతున్నారు. జగన్ పర్యటనలు దండయాత్ర మాదిరిగా ఉంటున్నాయని అలా ఆయన చేయాలనుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

మరో వైపు తమ అధినేత పర్యటనలకే ఆంక్షలు రూల్స్ పెడుతున్నారని ఇదంతా రాజకీయమే అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇలా అటూ ఇటూ కూడా పట్టుబట్టి ఉండడంతో జగన్ టూర్లు మీద ఫోకస్ మరింతగా పెరుతోంది అని అంటున్నారు. మరి బంగారుపాళెం జగన్ టూర్ లో అయిదు వందల మంది మాత్రమే పాల్గొంటారా లేక వేలాదిగా తరలి వస్తారా అన్నది ఈ నెల 9న తేలనుంది.

Tags:    

Similar News