జగన్ కి బ్రేకులు వేస్తున్నది వారేనా ?

ఏపీలో 2026 వస్తూనే రాజకీయం మార్చాలని గేర్ మార్చి స్పీడ్ పెంచాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు జనవరి తరువాత ఆయన జిల్లాల పర్యటన చేపడతారు అని అంటున్నారు.;

Update: 2025-11-25 00:30 GMT

వైసీపీ అధినేత జగన్ జనంలోకి రావాలని చూస్తున్నారు. ఆయన గత ఏడాది నుంచే ఆ దిశగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ లో జగన్ ఈ మేరకు పార్టీ నేతలకు కూడా చెప్పారు. 2025లో పండుగ తరువాత జనంలోకి వస్తాను అని. అయితే గిర్రున ఏడాది కాలం అయితే ఇట్టే తిరిగిపోయింది కానీ జగన్ గడప మాత్రం దాటి బయటకు రాలేకపోయారు. అడపా తడపా జగన్ పర్యటనలు చేస్తున్న ఆయన యాక్షన్ ప్లాన్ వేరేగా ఉందని అంటున్నారు. అయితే అది అమలు జరగకుండా సొంత పార్టీ నుంచే బ్రేకులు పడుతున్నాయని అంటున్నారు.

కమిటీలు పూర్తి అయితే :

వైసీపీని గ్రౌండ్ లెవెల్ వరకూ పటిష్టం చేయాలని జగన్ భావిస్తున్నారు. బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గం స్థాయి దాకా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆయన పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమించారు. అంతే కాదు పార్లమెంట్ కి పరిశీలకులను నియమించారు. అదే విధంగా రీజనల్ కో ఆర్డినేటర్లతో పాటు పార్టీ అనుబంధ విభాగాలకు కూడా ప్రాంతీయంగా ఎక్కడికక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. ఇక బూత్ స్థాయి దాకా కమిటీలు వేయాల్సిన బాధ్యత అయితే పాటీ నేతల మీదనే ఉంది అని అంటున్నారు.

డెడ్ లైన్ పెట్టేశారు :

ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పార్టీ కమిటీలు అన్నీ పూర్తి కావాలని జగన్ ఇప్పటికే తేల్చి చెప్పేశారు. అలా కాకుండా ఎవరైనా ఆలస్యం చేస్తే సహించమని కూడా సందేశాన్ని పంపిస్తున్నారు మరో వైపు ఎవరు పనిచేస్తున్నారు ఎవరు చేయడం లేదు అన్న దాని మీద ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జిలకు సంబంధించిన డేటాను కూడా ఆయన కలెక్ట్ చేస్తున్నారు. ఆ మీదట వారి విషయంలో కూడా కఠిన నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు.

ఇదీ షెడ్యూల్ :

ఏపీలో 2026 వస్తూనే రాజకీయం మార్చాలని గేర్ మార్చి స్పీడ్ పెంచాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు జనవరి తరువాత ఆయన జిల్లాల పర్యటన చేపడతారు అని అంటున్నారు. ఆరు నెలల పాటు మొత్తం ఉమ్మడి జిల్లాలలో జగన్ టూర్ సాగుతుందని అంటున్నారు. ఈ సందర్భంగా తానే స్వయంగా పార్టీ పరిస్థితిని తెలుసుకోవాలని ఆయన భావిస్తున్నారు అంటున్నారు. జిల్లాల పర్యటన తరువాత వైసీపీ ప్లీనరీని 2026 జూలై 7, 8 తేదీలలో నిర్వహించాలని చూస్తున్నారు. అది జరిగిన అనంతరం 2027 నుంచి జగన్ మహా పాదయాత్రకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు.

సొంత వారే అడ్డంకిగా :

అయితే జగన్ జనంలోకి రావాలంటే పార్టీ గ్రౌండ్ లెవెల్ దాకా పటిష్టంగా ఉండాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు. పార్టీ సభ్యత్వం కూడా చేయిస్తే కనుక అధికార పక్షం మీద పోరాటం చేసేందుకు వీలు అవుతుందని ఆయన భావిస్తున్నారుట. అయితే చాలా చోట్ల కమిటీలు వేయడంలో ఈ రోజుకీ జాప్యం అవుతోంది అని అంటున్నారు జగన్ ఎన్ని సార్లు చెప్పినా నేతలు అయితే పెద్దగా శ్రద్ధ చూపించడంలేదని అంటున్నారు. మరో వైపు చూస్తే చాలా మంది నాయకులు తమ సొంత నియోజకవర్గంలో ఉండడంలేదని కూడా అంటున్నారు. ఈ రకమైన పరిస్థితుల వల్లనే జగన్ జిల్లా పర్యటన మరింత ఆలస్యం అవుతోంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే 2026 జనవరి నుంచి జగన్ జిల్లాల టూర్లు ఉంటాయా లేదా అన్నది ఆయన చేతిలో కంటే నాయకుల చేతిలోనే ఉంది అని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.

Tags:    

Similar News