తత్కాల్ రూల్స్ మారాయి..

జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఐఆర్సీటీసీలో తత్కాల్‌ టికెట్ బుకింగ్‌కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి.;

Update: 2025-06-13 00:30 GMT

తత్కాల్‌లో ట్రైన్ టికెట్లు బుక్ చేయడం ఓ పెద్ద ప్రహసనం. ఎంత స్పీడ్ ఇంటర్నెట్ ఉపయోగించినా.. అధునాతన కంప్యూటర్ వాడినా.. టికెట్లు సెకన్లలో హాంఫట్ అయిపోతాయి. టికెట్ బుక్ కాలేదని మెసేజ్ ప్రత్యక్షం అవుతుంది. ఐతే టికెట్ల బుకింగ్‌లో పెద్ద మాఫియా నడుస్తోందని.. ఏజెంట్లు బల్క్‌గా టికెట్లు బుక్ చేసుకుని వాటిని బ్లాక్‌లో అమ్ముకుంటారని.. అందుకే సాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరకవనే ఆరోపణలున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఐఆర్సీటీసీ మీద కంప్లైంట్లు వస్తున్నా.. లోపాలను సరి చేయాలని కోరుతున్నా స్పందన లేదు. ఐతే ఎట్టకేలకు రైల్వే శాఖ ట్రైన్ టికెట్ల బుకింగ్‌లో కొన్ని కీలక మార్పులు చేసింది.

జులై 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై ఐఆర్సీటీసీలో తత్కాల్‌ టికెట్ బుకింగ్‌కు ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి. ఓటీపీ ద్వారా ఆధార్ వెరిఫికేషన్ జరిగాకే టికెట్ బుకింగ్ సాధ్యమవుతుంది. పీఆర్ఎస్ కౌంటర్లలో, ఆథరైజ్డ్ ఏజెంట్స్ ద్వారా టికెట్లు బుక్ చేయాలన్నా ఎవరి పేరు మీద అయితే టికెట్లు తీసుకుంటున్నారో వారి ఆధార్‌తో ఓటీపీ వెరిఫికేషన్ చేయాల్సిందే. దీని వల్ల నిజమైన యూజర్లకు మాత్రమే టికెట్లు బుక్ చేయడానికి అవకాశముంటుంది. ఇతరులు బల్క్‌గా టికెట్లు బుక్ చేసుకుని వాటిని బ్లాక్‌లో అమ్ముకోవడానికి అవకాశముండదు.

అంతే కాక రైల్వే శాఖ మరో కీలక మార్పు కూడా చేసింది. తొలి అరగంటలో ట్రావెల్ ఏజెంట్లు టికెట్లు బుక్ చేయడానికి వీలుండదు. అంటే ఉదయం 10-1.30 మధ్య ఏసీ, 11-11.30 మధ్య నాన్ ఏసీ క్లాసుల్లో వీరు టికెట్లు బుక్ చేయలేరు.

మొత్తంగా ఈ మార్పుల వల్ల ఐఆర్సీటీసీ ట్రాఫిక్ తగ్గుతుందని.. తమ కోసమే టికెట్లు బుక్ చేసుకునేవారికి సులువుగా టికెట్లు దొరుకుతాయని రైల్వే శాఖ పేర్కొంటోంది. తత్కాల్ టికెట్ల మాఫియాకు ఈ నిర్ణయాలతో చెక్ పడినట్లే అని భావిస్తున్నారు. వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఐతే ఆధార్ వెరిఫికేసన్ జులై 15 నుంచి ఆరంభమవుతుంది.

Tags:    

Similar News