'పాక్ నుంచి వెళ్లిపో భారత్ మహిళ'... 'నేను వెళ్లను, ఇక్కడే ఉంటాను'!

ఈ సమయంలో ఆమెను ఎలాగైన భారత్ పంపాపని అక్కడి అధికారులు ప్రయత్నిస్తుండగా.. తాను భారత్ వెళ్లలని, తాను పాక్ లోనే కాపురం ఉంటానని చెబుతుండటం గమనార్హం.;

Update: 2026-01-15 04:41 GMT

ఇటీవల భారత్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన ఓ మహిళ, అక్కడ ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ సమయంలో ఆమెపై సందేహంతోనో ఏమో కానీ. అక్కడి పోలీసులు నిత్యం ఆమె ఉంటున్న ప్రాంతాన్ని తనిఖీ చేస్తున్నారు. దీంతో తననూ పోలీసులు వేధిస్తున్నారని ఆమె కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆమెకు ఉపశమనం లభించింది. ఈ సమయంలో ఆమెను ఎలాగైన భారత్ పంపాపని అక్కడి అధికారులు ప్రయత్నిస్తుండగా.. తాను భారత్ వెళ్లలని, తాను పాక్ లోనే కాపురం ఉంటానని చెబుతుండటం గమనార్హం.

అవును... జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ది అంటారు. ప్రశాంతంగా, ధైర్యంగా, పరిపూణమైన పౌరహక్కులతో భారత్ లాంటి దేశంలో నివసించాలని చాలా మంది కోరుకుంటుంటే... భారత్ లోని పంజాబ్ కు చెందిన మహిళ మాత్రం.. (అక్రమంగా!) పాకిస్థాన్ వెళ్లి, అక్కడ పౌరుడిని వివాహం చేసుకుని, కాపురం పెట్టిన మహిళ.. తనకు భారత్ లో ఇప్పటికే విడాకులు అయిపోయాయని.. తాను పాక్ పౌరుడిని వివాహం చేసుకున్నానని.. తాను పాక్ లో ఉండటానికి వీసా గడుపు పొడిగించాలని కోరుతోంది!

వివరాళ్లోకి వెళ్తే... గత ఏడాది నవంబర్‌ లో గురునానక్‌ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి సుమారు 2వేల మంది సిక్కు యాత్రికులు 10 రోజుల యాత్రకోసం పాకిస్థాన్‌ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులో సరబ్‌ జిత్‌ కౌర్‌ (48) కూడా ఒకరు. అయితే.. కొన్ని రోజుల తర్వాత యాత్రికులందరూ తిరిగి స్వదేశానికి వచ్చినప్పటికీ.. వారిలో కౌర్‌ మాత్రం లేరు. దీంతో ఆమె ఆచూకీ కోసం పాక్ అధికారులకు ఫిర్యాదులు అందాయి.

అయితే ఆమె పాకిస్థాన్ లోని షేక్‌ పురా జిల్లాకు చెందిన నాసిర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు లాహోర్‌ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమె వివాహానికి ముందే ఇస్లాం మతంలోకి మారి తన పేరును నూర్ గా మార్చుకున్నట్లు కథనాలొచ్చాయి. అయితే... ఆమెపై సందేహంతోనో ఏమో కానీ... పాక్ పోలీసులు తమ ఇంట్లో అక్రమంగా సోదాలు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొంటూ కౌర్‌, హుస్సేన్‌ లు స్థానిక హైకోర్టును ఆశ్రయించగా.. వారిని వేధించవద్దని కోర్టు ఆదేశించింది.

ఇదే సమయంలో అమెను తిరిగి భారత్ కు పంపించేందుకు పాకిస్థాన్‌ అధికారులు ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. వాఘా-అటారీ సరిహద్దు మూసివేతతో అది కుదరడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పునరావాస కేంద్రానికి తరలించినట్లు వెల్లడించారు. అయితే, సరబ్ జిత్ కౌర్ మాత్రం తాను భారత్ కు వెళ్లనని.. పాకిస్థాన్ లోనే ఉంటానని పట్టుబడుతున్నారని అంటున్నారు.

ఇందులో భాగంగా... తన వీసా పొడిగించాలని కోరుతూ ఇస్లామాబాద్‌ లోని ఎంబసీని కోరానని.. పాక్‌ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నానని ఇటీవల విడుదల చేసిన ఓ వీడియోలో ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో... తాను ఇప్పటికే విడాకులు తీసుకున్న మహిళనని, హుస్సేన్‌ ను వివాహం చేసుకునేందుకే ఇక్కడకు వచ్చానని ఆమె చెబుతున్నారు. దీంతో.. ఈమె వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News