• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇండియన్ Vs అమెరికన్...

ఇండియన్ Vs అమెరికన్ ఇంగ్లీష్.. నిజ జీవితంలో ఈ తేడా గమనించారా?

| తాజాగా ఒక ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది . అది భారతీయ ఇంగ్లీష్ వర్సెస్ అమెరికన్ ఇంగ్లీష్ లను పోల్చుతూ కొన్ని విచిత్రమైన తేడాలను ఎత్తిచూపే వీడియో.

By - Tupaki Desk
Update: 2025-08-23 19:30 GMT

గల్లీ నుండి ఢిల్లీ వరకు.. ప్రపంచ దేశాలు చుట్టేయాలన్నా ఇప్పుడు ఇంగ్లీష్ తప్పనిసరి అయిపోయింది. అంతే కాదండోయ్ నిజ జీవితంలో ఇంగ్లీష్ మాట్లాడకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నారు. ముఖ్యంగా మాట్లాడే భాష ఏదైనా సరే కచ్చితంగా అందులో ఇంగ్లీష్ పదాలు వాడాల్సిందే. అంతలా ఇంగ్లీష్ ప్రాచుర్యం పొందుతోంది. దైనందిక జీవితంలో ఇంగ్లీషు పదాలు వాడకుండా స్వచ్ఛమైన మాతృభాషలో మాట్లాడేవారు చాలా తక్కువ మందే ఉన్నారు అనడంలో సందేహం లేదు. ఇక అలాంటి నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని ఒక ఇద్దరు మిత్రులు చేసిన ఫన్నీ వీడియో ఇప్పుడు అందరిలో నవ్వు తెప్పిస్తోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు నిజమే కదా అంటూ వారికి వత్తాసు పలుకుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

తాజాగా ఒక ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది . అది భారతీయ ఇంగ్లీష్ వర్సెస్ అమెరికన్ ఇంగ్లీష్ లను పోల్చుతూ కొన్ని విచిత్రమైన తేడాలను ఎత్తిచూపే వీడియో. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఈ తేడా అటు నెటిజనులను కూడా పూర్తిగా నవ్వించడమే కాదు ఆలోచింప చేస్తోంది అని చెప్పవచ్చు. చాలామంది రోజువారి పదబంధాలను కొత్త వెలుగులో చూస్తున్నారు అని కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని లలిత కుమార్ శర్మ అనే ఒక ఇంస్టాగ్రామ్ యూజర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అందులో ఒక అమ్మాయి.. అబ్బాయి పక్కపక్కనే కూర్చుని.. అమ్మాయి అమెరికన్ ఇంగ్లీషులో.. అబ్బాయి ఇండియన్ ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా వారి మధ్య వచ్చిన ఫన్నీ సంభాషణలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.

అమెరికన్ ఇంగ్లీష్ Vs ఇండియన్ ఇంగ్లీష్..

అమ్మాయి : స్టార్ట్

అబ్బాయి : షురూ సే స్టార్ట్ కర్తే హై

అమ్మాయి: రిటర్న్

అబ్బాయి: రిటర్న్ బ్యాక్ కరో

అమ్మాయి : లెట్స్ స్టార్ట్

అబ్బాయి : చలో షురూ సే స్టార్ట్ కర్తే హై

అమ్మాయి: ఫార్వర్డ్

అబ్బాయి: ఏ జీ ఫార్వర్డ్ కర్ దియా హై మైనే

అమ్మాయి : గిఫ్ట్

అబ్బాయి : ఫ్రీ కా గిఫ్ట్ మిలా హై

అమ్మాయి : సారీ

అబ్బాయి: సారీ యార్ మాఫ్ కర్ దేనా

ఇలా ఈ సంభాషణలకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు చాలామందిని కడుపుబ్బా నవ్విస్తోందని చెప్పవచ్చు.. అంతేకాదు ఈ సన్నిహితులు రెండవ రీల్ కూడా షేర్ చేయగా వీక్షకులు ఎప్పటిలాగే తాము కూడా తరచుగా ఇలా మాట్లాడుతామని ఒప్పుకుంటూ ప్రతిస్పందించడం గమనార్హం. ఇకపోతే పోస్ట్ చేసినప్పటి నుండి ఈ వీడియో ఇప్పటివరకు 3 లక్షల పైగా వీక్షణలు, వేల కామెంట్లు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ జంట చేసిన కామెంట్లను నిజజీవితంలో తాము ఉపయోగిస్తున్న పదాలను కూడా ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఈ తేడా ఇప్పుడు అందరిని నవ్విస్తోంది అని చెప్పవచ్చు.

Tags:    
  • IndianEnglish 
  • AmericanEnglish 
  • ViralVideo 
  • FunnyReel 
  • InstagramReels 
  • EnglishVsEnglish 
  • ఇంగ్లీష్ 
  • హాస్యవీడియో 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS