ఆ దేశానికి పోస్టల్ సేవలు నిలిపేసిన భారత్.. అసలేమైందంటే?
యూఎస్డీ 800 వరకు విలువైన వస్తువులకు సుంకం రహిత డి మినిమిస్ మినహాయింపును ఉపసంహరించుకుంటూ జూలై 30న యూఎస్ పరిపాలన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబర్ 14324 అనుసరించి..;
రివెంజ్ విషయానికి వస్తే ఎలా ఉంటుందో భారత్ మరొకసారి నిరూపించడానికి సిద్ధం అయింది. అందులో భాగంగానే ఆ దేశానికి పోస్టల్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం ఆదేశానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని చెప్పవచ్చు అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నామనే సాకుతో భారత్ పై అమెరికా సుంకాలు విధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరును ఇప్పుడు ఇండియా సీరియస్ గా తీసుకుంది. అందులో భాగంగానే మీ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదు.. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యం అంటూ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అమెరికాకు భారీ షాక్ ఇస్తూ.. పోస్టల్ సేవలు నిలిపివేయనుంది. ఈనెల చివరిలో అమల్లోకి వచ్చే యూఎస్ కస్టమ్స్ నిబంధనలలో మార్పులను తెలియజేస్తూ.. ఆగస్టు 25 నుండి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ శనివారం ప్రకటించింది.
యూఎస్డీ 800 వరకు విలువైన వస్తువులకు సుంకం రహిత డి మినిమిస్ మినహాయింపును ఉపసంహరించుకుంటూ జూలై 30న యూఎస్ పరిపాలన జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నెంబర్ 14324 అనుసరించి.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపోతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అదనంగా 25 శాతం జరిమానా విధించగా.. దీంతో మొత్తం సుంకాల భారం 50 శాతానికి చేరుకుంది. దీంతో సీరియస్ అయిన భారత్.. తపాలా సేవలను నిలిపివేస్తూ..ఆగస్టు 29 నుండి ఈ ఆర్డర్స్ అమలులోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు తపాల శాఖ.. అమెరికాకు ఉద్దేశించిన అన్ని అంతర్జాతీయ పోస్టల్ నెట్వర్క్.. వాటి విలువతో సంబంధం లేకుండా దేశ నిర్దిష్ట అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక శక్తి చట్టం వరకు ప్రకారం కస్టమ్స్ సుంకాలకు లోబడి ఉంటాయి అంటూ స్పష్టం చేసింది. ఇకపోతే డెలివరీ కాని వస్తువులను ఇప్పటికే బుక్ చేసుకున్న కష్టమర్లు పోస్టేజ్ రిఫండ్ కోరవచ్చు అని కూడా తెలిపింది.