పాక్ వైమానిక స్థావరాలపై బలమైన దెబ్బ కొట్టిన భారత్

అయితే.. ఈ దాడుల సమాచారాన్ని పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి వెల్లడించారు.;

Update: 2025-05-10 04:21 GMT

అదే పనిగా భారత సరిహద్దుల వెంట ఆత్మాహుతి డ్రోన్లు.. శతఘ్నులతో పాక్ సైన్యం చేస్తున్న దాడులకు భారత్ ప్రతిస్పందించింది. ఇందులో భాగంగా పాక్ లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడినట్లుగా వెల్లడైంది.

అయితే.. ఈ దాడుల సమాచారాన్ని పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరిఫ్ చౌదురి వెల్లడించారు. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్ ఖాన్.. చక్వాల్ లోని మురీద్.. జాంగ్ జిల్లా షోర్కోట్ లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగినట్లుగా పాక్ చెబుతోంది.

ఈ దాడులకు తాము ప్రతిస్పందిస్తామని.. భారత్ మీద జరిపే దాడులకు ‘ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్’ అనే పేరు పెట్టినట్లుగా చెబుతున్నారు. దీనికి తెలుగులో అర్థం బలమైన పునాదిగా చెప్పొచ్చు. గురు.. శుక్రవారాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పాక్ చేస్తున్న దాడుల ప్యాట్రన్ ను చూస్తే.. ఒక్క విషయం అర్థమవుతుంది. పగటి పూట ప్రశాంతంగా ఉంటున్న పాక్ సైన్యం.. చీకట్లు ముసురుకున్నంతనే తమ కుట్రల్ని అమలు చేస్తున్నారు.

ఆత్మాహుతి డ్రోన్లు.. శతఘ్నులతో దాడులు చేస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్న పరిస్థితి. అయితే.. అత్యంత అప్రమత్తంగా ఉంటున్న భారత సైన్యం పాక్ ప్రయోగిస్తున్న డ్రోన్లను సమర్థంగా నిలువరిస్తోంది. ఈ తెల్లవారుజామున (శనివారం) పాక్ దాడులకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. పాక్ లోని మూడు వైమానిక స్థావరాలపై భారత్ జరిపిన దాడుల నష్ట తీవ్రత ఎంతన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags:    

Similar News