• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఊకోవయ్యా ట్రంప్.....

ఊకోవయ్యా ట్రంప్.. షాకిచ్చిన భారత్

| రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

By - A.N.Kumar
Update: 2025-08-02 06:31 GMT

రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. భారత్‌ రష్యా నుంచి చమురు కొనడం నిలిపేసిందని విన్నానని, అది నిజమైతే మంచి నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. "ఇది నిజమా కాదా నాకు తెలియదు. కానీ నిజమైతే అది మంచి నిర్ణయమే. దానివల్ల ఏం జరుగుతుందో చూద్దాం" అని ట్రంప్ అన్నారు.

ఇకపై భారత్‌ రష్యా ఆయిల్‌ను కొనదన్న వాదనపై ట్రంప్ స్పందించిన వేళ భారత ప్రభుత్వ వర్గాలు ఆయన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాయి. ‘‘భారత చమురు సంస్థలు రష్యా సరఫరాదారుల నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తున్నాయి. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, ఆర్థిక ప్రామాణికత వంటి అంశాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం. 85 శాతం ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్‌ వంటి దేశానికి అందుబాటు ధరలో లభించే క్రూడ్ ఆయిల్‌ కీలకం. దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం. అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా, గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటాం’’ అని స్పష్టం చేశారు.

-ట్రంప్, అమెరికా అసంతృప్తికి కారణమేంటి?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలు, ముఖ్యంగా అమెరికా, రష్యాపై ఆంక్షలు విధించాయి. అయితే భారత్‌ ఆ ఆంక్షలకు కట్టుబడి ఉండకుండా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుండటంపై ట్రంప్‌తో పాటు పలువురు అమెరికా నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో సైతం "భారత్‌ రష్యా చమురును కొనుగోలు చేయడం వల్లే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని కొనసాగించగలుగుతోంది" అంటూ వ్యాఖ్యానించారు.

-భారత్‌ కౌంటర్ స్పష్టత

అయితే, ఈ విమర్శలకు భారత విదేశాంగ శాఖ సూటిగా స్పందించింది. ‘‘రష్యా నుంచి చమురు కొనుగోలుకు మేము కట్టుబడి ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న, అత్యుత్తమమైన ధరలో లభించే వనరులను వినియోగించుకోవడం దేశ ప్రయోజనాలను కాపాడుకునే దిశలో ముఖ్యమైన చర్య. ఇది అంతర్జాతీయ ఇంధన స్థిరత్వానికి కూడా సానుకూలంగా ఉంటుంది’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు.

రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్‌ తీసుకుంటున్న వైఖరి పూర్తిగా దేశ ప్రయోజనాలకే కట్టుబడి ఉందని కేంద్రం స్పష్టం చేస్తోంది. ట్రంప్ లాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలకూ, అమెరికా నేతల విమర్శలకూ తగిన జవాబునిస్తూ... భారత్‌ తన స్వతంత్ర ప్రతిపత్తిని కొనసాగిస్తోందన్నది స్పష్టమవుతోంది.

Tags:    
  • IndiaRussiaOil 
  • TrumpOnIndia 
  • RussianOil 
  • Geopolitics 
  • EnergySecurity 
  • IndianOilPolicy 
  • GlobalOilMarket 
  • USIndiaRelations 
  • CrudeOilImports 
  • ForeignPolicy 
  • Donald Trump 
  • Narendra Modi 
  • Randeep Jaiswal 

Similar News

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

ఏం చూడకుండానే ఏఐ ద్వారా ఉత్తర్వులు.. అధికారులకు హైకోర్టు మొట్టికాయలు..

2026-11-05 07:14 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

Copyright @2026

Powered by Blink CMS