భారత్ చర్యతో పాక్‌లో కలకలం..సెలవులు రద్దు, మదర్సాలు మూత!
ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అన్ని మదర్సాలను వచ్చే 10 రోజుల పాటు మూసివేశారు.;
పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య వాతావరణం బాగా చెడింది. దీంతో సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందో అనే టెన్షన్ పాకిస్తాన్‌ను బాగా పట్టుకుంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో (పీఓకే) తీవ్ర భయం నెలకొంది. వాళ్ల ఏర్పాట్లే ఆ భయాన్ని బయటపెడుతున్నాయి. పీఓకేలో గవర్నమెంట్ ఉద్యోగుల సెలవులన్నీ రద్దు చేశారు. ఇప్పుడు ఏకంగా మదర్సాలను (ముస్లిం పాఠశాలలు) కూడా మూసేయాలని నిర్ణయించారు.
ద ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని అన్ని మదర్సాలను వచ్చే 10 రోజుల పాటు మూసివేశారు. ఎలాంటి దాడి జరిగినా తొక్కిసలాట జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో పిల్లలందరూ ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
భారత్ కన్ను పీఓకేపైనే
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం ఎప్పటినుంచో భారత్ రాడార్‌లో ఉంది. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయాలని భారత ప్రభుత్వం చాలాసార్లు చెప్పిచూసింది. స్వయంగా భారత హోం మంత్రి అమిత్ షా భారత పార్లమెంటులోనే ఈ ప్రాంతాన్ని తిరిగి తీసుకుంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాదులకు పెద్ద స్థావరంగా మారిపోయింది. ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, భారత్‌పై దాడి చేసేందుకు కుట్రలు పన్నడం అంతా అక్కడే జరుగుతోంది.
పీఓకేలో నాలుగు కీలక నిర్ణయాలు:
* పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రభుత్వం అక్కడి టూర్ ఆపరేటర్లందరినీ నీలం లోయ వైపు ప్రజలను తీసుకెళ్లవద్దని ఆదేశించింది. దాడి జరిగే అవకాశం ఉందనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
* పీఓకేలోని ప్రభుత్వ ఉద్యోగులందరి సెలవులు రద్దు చేశారు. ఎవరూ సెలవు పెట్టకూడదని, సెలవులో ఉన్నవారు వెంటనే విధుల్లోకి తిరిగి రావాలని ఆదేశించారు.
* పీఓకేలోని అన్ని మదర్సాలను మూసివేయాలని నిర్ణయించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగకుండా ఉండేందుకే పిల్లలను ఇళ్లలోనే ఉండాలని చెప్పారు.
* పీఓకే ప్రభుత్వం అక్కడి ప్రజలకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా తమను తాము రక్షించుకోవాలో వారికి నేర్పిస్తున్నారు.