మొబైల్ ఎయిర్ డిఫెన్స్ లో కీలక అడుగు.. ఈ మిసైల్ గురించి తెలిస్తే షాక్ కావాల్సిందే..

భారత రక్షణ వ్యవస్థలోకి మరో మిసైల్ చేరింది. ఇది భూతల, సముద్ర తలం నుంచి దుర్భేధ్యమైనదిగా నిలవనుంది. దీని ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీఓ తయారు చేసింది;

Update: 2025-10-09 06:33 GMT

భారత రక్షణ వ్యవస్థలోకి మరో మిసైల్ చేరింది. ఇది భూతల, సముద్ర తలం నుంచి దుర్భేధ్యమైనదిగా నిలవనుంది. దీని ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీఓ తయారు చేసింది. దేశ రక్షణ పరిశోధన సంస్థ డీఆర్డీఓ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్) తాజాగా నావికా రంగంలో VL-SRSAM (Vertical Launch – Short Range Surface to Air Missile) పరీక్షలతో దేశ రక్షణ సామర్థ్యానికి కొత్త ఊపిరి పోసింది. ఇప్పుడు అదే సాంకేతికత ఆధారంగా మొబైల్ ల్యాండ్-బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ట్రక్కు-మౌంటెడ్‌ వర్షన్‌ ట్రయల్స్‌కు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇది భూమి నుంచి గగనతల రక్షణలో శక్తివంతమైన అస్త్రంగా మారనుంది.

మొబైల్ ఎయిర్ డిఫెన్స్ అవసరం ఎందుకు?

ఆధునిక యుద్ధాలలో చలనం, వేగం అత్యంత కీలకం. శత్రు దాడులు కేవలం గగనతల నుంచే కాకుండా డ్రోన్లు, క్రూయిజ్‌ మిసైల్స్ ద్వారా కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ‘మూవబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌’ దీనిని పక్కాగా ఎదుర్కొంటుంది. ట్రక్కులపై VL-SRSAM అమర్చడం వల్ల వేగంగా యుద్ధ ప్రాంతాలకు తరలించవచ్చు. ఇది సరిహద్దుల్లో, సముద్రతీర ప్రాంతాల్లో రక్షణ చర్యలకు బాలాన్ని ఇస్తుంది.

పూర్తి స్వదేశీ సాంకేతికత..

VL-SRSAM పూర్తిగా దేశీయంగా తయారు చేసిన మిసైల్ సిస్టమ్‌. దీనని తయారు చేసి, పరీక్షించే వరకు మొత్తం భారతే చూసుకుంది. ఈ మిసైల్‌ సముద్రతీరంలో నావికా నౌకలను రక్షించడంలో ఇప్పటికే తన సమర్థాన్ని నిరూపించింది. ఇప్పుడు భూసేన కోసం దీని మొబైల్ వేరియంట్ అభివృద్ధి చేయడం ద్వారా భారత్‌ రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది.

చైనా, పాక్ దృష్టిలో భారత్‌

భారత సరిహద్దుల్లోని చైనా, పాకిస్థాన్‌ నుంచి ఎప్పుడూ భద్రతా సవాళ్లు ఉండనే ఉంటాయి. వీటిని ఎదుర్కోవడంలో మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. వీటి అమలుతో దేశం గగనతల రక్షణలో వేగంగా ప్రతిస్పందిస్తుంది. డ్రోన్లు, ఫైటర్‌ జెట్ల నుంచి వచ్చే ప్రమాదాలను ఎదుర్కోవడంలో ఈ సిస్టమ్‌ ఒక ‘షీల్డ్‌’గా ఉపయోగపడుతుంది.

అంతర్జాతీయ గుర్తింపు

డీఆర్డీఓ సాంకేతికత ప్రపంచ దృష్టిని ఆకర్షితస్తుంది. VL-SRSAM, అగ్ని ప్రైమ్‌, ప్రళయ్‌, ఆకాశ్‌ తదితర ప్రాజెక్టులు భారత రక్షణ రంగంలో శాస్త్ర సాంకేతిక సమర్థతకు ప్రతీకలుగా నిలిచాయి. ట్రక్కు ఆధారిత VL-SRSAM విజయవంతమైతే, భారత్‌ గ్లోబల్‌ డిఫెన్స్ మార్కెట్‌లో గొప్ప ఎగుమతిదారుగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దూసుకెళ్తున్న భారత్‌

VL-SRSAM ట్రయల్స్‌ విజయవంతమైతే, భూతలం, సముద్ర తలం నుంచి బలమైన రక్షణ వ్యవస్థ సిద్ధం అవుతుంది. ఇది కేవలం సైనిక శక్తి పెరుగుద మాత్రమేకాదు.. దేశీయ పరిశోధన, పరిశ్రమల సమన్వయానికి ప్రతీక. డీఆర్డీఓ ఈ దిశగా వేస్తున్న ప్రతీ అడుగు, దేశాన్ని రక్షణ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధిగా నిలబెడుతోంది.

Tags:    

Similar News