విమానాశ్రయాల్లో వీల్ చైర్ స్కామ్?... కిరణ్ మజుందర్ షా సూచన వైరల్!
అవును... ఇండియా – యూఎస్ విమానాల్లో అత్యధికంగా ప్రయాణికులు వీల్ చైర్ రిక్వస్ట్ పెడుతున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.;
భారత్ లోని ప్రధాన విమానాశ్రయాల్లో వీల్ చైర్ అభ్యర్థనల పెరుగుదల ఒక ముఖ్యమైన సమస్యగా మారిందనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలకు ప్రతీ నెలా ఈ విషయంలో అధిక సంఖ్యలో అభ్యర్థనలు వస్తున్నాయని అంటున్నారు.
అవును... ఇండియా – యూఎస్ విమానాల్లో అత్యధికంగా ప్రయాణికులు వీల్ చైర్ రిక్వస్ట్ పెడుతున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి వీడియోలు ఆన్ లైన్ లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ సమయంలో బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఈ వీడియోలపై స్పందించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సూచన చేశారు.
ఈ క్రమంలో... కొంతమంది ప్రయాణికులు వైద్య పరిస్థితులు లేదా వృద్ధాప్యం కారణంగా నిజంగా ఈ సహాయం అవసరం అయితే.. ఈసేవను ఉపయోగించుకుంటున్నవారు మాత్రం అత్యధికంగా ఉంటూ, పొడవైన క్యూలు కనిపిస్తున్నాయని అంటున్నారు. దీంతో.. సుదీర్ఘమైన నడకలను నివారించడానికి ఒక మార్గంగా దీన్ని ఉపయోగిస్తున్నారని అంటున్నారు.
అయితే...విమానయాన మంత్రిత్వ శాఖ పెరుగుతున్న ఈ డిమాండ్ ను నిశితంగా పర్యవేక్షిస్తోందని.. డీజీసీఏ పరిస్థితిని సమీక్షిస్తోందని.. మార్గదర్శకాలు రూపొందించవచ్చని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి! అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది సహాయం చేయగల దానికంటే ఎక్కువ వీల్ చైర్ బౌండ్ ప్రయాణికులను తీసుకెళ్లడం వల్ల కలిగే భద్రతా సమస్యలను అధికారులు హైలెట్ చేస్తున్నారు!
దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ప్రతి నెలా లక్ష కంటే ఎక్కువ వీల్ చైర్ బుకింగ్ లను ఎయిరిండియా నిర్వహిస్తోందని.. ఉత్తర అమెరికా, యూకేకి వెళ్లే మార్గాల్లో ఎయిర్ లైన్ అత్యధిక డిమాండ్ ను ఎదుర్కొంటుందని చెబుతున్నారు.
దీనికి సంబంధించి వైరల్ అవుతోన్న వీడియోపై స్పందించిన కిరణ్ మజుందార్ షా.. "వారు విమానాశ్రయానికి అదనంగా రూ.5,000 వసూలు చేయాలి.. అప్పుడు ఎంతమంది నిజమైన ప్రయాణికులు ఉన్నారో వారు చూస్తారు!" అని రాశారు. ఇదే సమయంలో... వీల్ చైర్ సేవలపై $50 ఛార్జ్ చేయండి.. ఉసెన్ బోల్ట్ లాగా నడుస్తున్న ఈ పాతవాళ్లను మీరు కనుగొంటారు అని రాశారు.