భారత సైన్యానికి కొత్త అస్త్రం.. శత్రువులకు ఇక చుక్కలే!
భారత్ తన సైనిక శక్తిని మరింత పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సైన్యానికి అత్యాధునికమైన కొత్త ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది.;
భారత్ తన సైనిక శక్తిని మరింత పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సైన్యానికి అత్యాధునికమైన కొత్త ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ అందుబాటులోకి రానుంది. తక్కువ దూరంలో ఉన్న శత్రు విమానాలు, డ్రోన్‌లను నేలకూల్చే సరికొత్త ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్ సిస్టమ్ (VSHORADS) కొనుగోలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ దీని కోసం టెండర్ (RFP) జారీ చేసింది. టెండర్ దాఖలు చేయడానికి చివరి తేదీ మే 20, 2025.
సమాచారం ప్రకారం.. ఈ టెండర్ ద్వారా రక్షణ మంత్రిత్వ శాఖ 48 లాంచర్‌లు, 48 నైట్ విజన్ పరికరాలు, 85 మిస్సైల్‌లు, 1 మిస్సైల్ టెస్ట్ స్టేషన్‌ను కొనుగోలు చేయనుంది. విశేషం ఏమిటంటే..ఈ కొనుగోలు పూర్తిగా "మేక్ ఇన్ ఇండియా" పథకం కింద జరుగుతోంది. ఈ మిస్సైల్ సిస్టమ్ శత్రువుల విమానాలు లేదా డ్రోన్‌లను చాలా తక్కువ దూరంలోనే పేల్చివేయగలదు. దీని ద్వారా యుద్ధ విమానాలు, హెలికాప్టర్‌లు, డ్రోన్‌లను చాలా సులభంగా నాశనం చేయవచ్చు.
నేవీ, ఎయిర్‌ఫోర్స్ కూడా వాడొచ్చు
రక్షణ మంత్రిత్వ శాఖ తాజా RFP ఈ వ్యవస్థలు వైమానిక ముప్పుల మధ్య టెర్మినల్ , పాయింట్ డిఫెన్స్ కోసం అవసరమని పేర్కొంది. వీటిని కేవలం సైన్యం మాత్రమే కాకుండా, నావికాదళం, వైమానిక దళం కూడా భూమి, సముద్ర వేదికలపై ఉపయోగించగలవు.
సైన్యం ఎయిర్ డిఫెన్స్ మరింత పటిష్టం
ఈ మిస్సైల్ సిస్టమ్ డెమోను చూపించే బాధ్యత ఆయా కంపెనీలదే. ఇది ఎటువంటి ఖర్చు లేకుండా చేస్తుంది. ఈ వ్యవస్థను సైన్యం ఎయిర్ డిఫెన్స్ కెపాసిటీని బలోపేతం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ టెండర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. సాంకేతిక, వాణిజ్యపరమైన అన్ని ప్రమాణాలను చేరుకున్న కంపెనీలను మాత్రమే ఎంపిక చేస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ చర్య భారతదేశ భద్రతా సన్నద్ధతను మరింత బలోపేతం చేసే దిశగా ఒక పెద్ద నిర్ణయంగా పరిగణిస్తున్నారు.