ఏఐ కంటెంట్ క్రియేటర్లకు షాక్.. ఇక అది లేకుంటే జైలుకే..!
ఈ మేరకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలో ఒక కమిటీ సిద్ధం చేసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేధిక సమర్పించారు.;
కృత్రిమ మేధా (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-AI) ఆవిష్కరణలతో ప్రపంచం కొత్త దిశలో కదులుతోంది. ఒక క్లిక్‌తో వ్యాసాలు రాయడం, చిత్రాలు సృష్టించడం, వాయిస్‌లు, వాయిస్ ఓవర్లు, వీడియోలు తయారు చేయడం, వీడియో మిక్స్ చేయడం కూడా ఇప్పుడు సాధారణమే అయిపోయింది. మారుతున్న సాంకేతికత ఒకవైపు సమాజానికి ఉపయోగకరంగా ఉంటే, మరోవైపు తప్పుడు సమాచారానికి తలుపులు తెరిచింది. ఫేక్ న్యూస్, డీప్‌ఫేక్ వీడియోలు వివిధ దేశాల ప్రజాస్వామ్యాన్ని, వ్యక్తుల గౌరవ మర్యాదలను దెబ్బతీసే స్థాయికి చేరాయి. ఇది కొంత ఆందోళనకరమైన అంశమే.
ఈ నేపథ్యంలో భారత పార్లమెంటరీ స్లాండింగ్ కమిటీ ఇటీవల కొన్ని సిఫార్సులు చేసింది. AI కంటెంట్ క్రియేటర్లు తప్పనిసరిగా లైసెన్స్ ఇవ్వాలని ఈ సిఫార్సుల్లో ఉంది. అంటే, ఎవరు కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా వ్యాసం రాయాలన్నా, వీడియో రూపొందించాలన్నా, ముందుగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీని వెనుక ప్రభుత్వ ఉద్దేశం స్పష్టం అవుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న సాంకేతికతకు అడ్డుకట్ట వేయడం సాధ్యం కాని పని, కానీ దాని దుర్వినియోగాన్ని మాత్రం అరికట్టడం సాధ్యమని పార్లమెంట్ సంఘం భావిస్తోంది.
ఈ మేరకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే నేతృత్వంలో ఒక కమిటీ సిద్ధం చేసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు నివేధిక సమర్పించారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చ ప్రారంభించి బిల్లు రూపంలో తేవాలని అనుకుంటున్నారు. కమిటీ మరో ముఖ్యమైన అంశాన్ని కూడా స్పష్టం చేసింది. సమాచార మంత్రిత్వశాఖ, ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ మాత్రమే కాకుండా, ఇతర విభాగాల మధ్య కూడా సమన్వయం ఉండడం తప్పనిసరి అన్నారు. వివిధ శాఖలు ఇందులో భాగం అయితే మరింత మెరుగవుతుందన్నారు.
డీప్‌ఫేక్ సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది. గతంలో మనం చాలా మంది హీరోయిన్స్ డీప్ ఫేక్ తెచ్చిన చిక్కుల్లో పడ్డారు. రష్మికా మందన డీప్ ఫేక్ ఇది వచ్చిన కొత్తలో సంచలనంగా మారింది. వార్తల్లో, రీల్స్ లో ఆమే కనిపించింది. కానీ అక్కడున్నది తాను కాదని ఆమె స్పష్టం చేయడంతో పాటు సాంకేతికతను వాడి ఎలా ఇబ్బంది పెట్టారన్న విషయం సాంకేతిక నిపుణులు చెప్పడంతో ఆమెతో పాటు ఆమె ఫ్యాన్స్ కూల్ అయ్యారు. నకిలీ వీడియోలు, వాయిస్‌లు, స్పీచ్‌లను గుర్తించే రెండు ప్రాజెక్టులు కూడా ప్రారంభమయ్యాయి. ఇవి ప్రారంభ అడుగులు మాత్రమేనని, రాను రాను సమస్య పెరుగుతున్నందున చట్టపరమైన చర్యలు లేకుండా పరిష్కారం కష్టమని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
ప్రభుత్వ అభిమతం మంచిదే అయితే లైసెన్స్ విధానం అమల్లోకి వస్తే కొత్తగా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కంటెంట్ క్రియేటర్లకు ఇది అదనపు భారంగా మారవచ్చు. సృజనాత్మక అనేది పరిమితులకు లోబడి స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. అనే ప్రశ్నలు సహజంగానే వస్తాయి. లైసెన్స్ ప్రక్రియ కఠినంగా ఉంటే చిన్న స్థాయి సృష్టికర్తలు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలు లేకపోవడంతో నియంత్రణ సమగ్రంగా పనిచేయకపోవచ్చనే భయం ఉంది.
అయినా సరే, సమస్యను పూర్తిగా వదిలేయలేం. ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ ఆధారిత కంటెంట్ భవిష్యత్తు.. దాన్ని అడ్డుకోవడం సాధ్యం కాదు. ఏఐ వినియోగం బాధ్యతాయుతంగా ఉండేలా నియంత్రణలు అవసరం. లైసెన్స్ విధానం పారదర్శకంగా, సులభంగా అమలు చేస్తే, ప్రజాస్వామ్యం రక్షించడమే కాకుండా, సాంకేతికత సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు.