శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే ఎయిర్ క్రాఫ్ట్.. 400 వరకు తయారు చేస్తున్న భారత్..
జై జవాన్.. జై కిసాన్ నినాదంలో ఫస్ట్ జవాన్ ఏ యుద్ధంలోనైనా గెలిచేందుకు వెన్నుదన్నుగా ఉండేందుకు మిస్సయిల్స్, ఎయిర్ క్ట్రాఫ్ట్స్ పై దృష్టి పెట్టారు.;
మోడీ అధికారాలు చేపట్టినప్పటి నుంచి దేశ రక్షణ రంగంపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. జై జవాన్.. జై కిసాన్ నినాదంలో ఫస్ట్ జవాన్ ఏ యుద్ధంలోనైనా గెలిచేందుకు వెన్నుదన్నుగా ఉండేందుకు మిస్సయిల్స్, ఎయిర్ క్ట్రాఫ్ట్స్ పై దృష్టి పెట్టారు. అందుకే కోట్లాది రూపాయల బడ్జెట్ ను రక్షణ రంగానికే వినియోగించి శత్రుదుర్భేధ్యంగా తయారు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో పాక్ వణకడంప్రపంచం మొత్తం చూసింది. రక్షణ రంగాన్ని మరింత బలోపేతంగా చేసేందుకు ప్రభుత్వం LCA (Light Combat Aircraft) ఎయిర్ క్రాఫ్టులు తయారు చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం అమెరికా టెక్నాలజీని వాడుతూ 400 కంటే ఎక్కువ తయారు చేయబోతోంది. దీనికి పదేళ్ల కాలాన్ని భారత్ టార్గెట్ గా పెట్టుకుంది.
స్వదేశీ యుద్ధవిమానాల చరిత్రలో కొత్త అధ్యాయం
రాబోయే పదేళ్లలో భారతదేశం తన వైమానిక శక్తిలో విప్లవాత్మక మార్పు తేబోతోంది. అమెరికన్ GE (General Electrical) సంస్థతో భాగస్వామ్య ఏర్పరుచుకొని 400 కంటే ఎక్కువ స్వదేశీ లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA)లను తయారు చేస్తుంది. ఇందులో Mk1, Mk2 ఉండనున్నాయి. ఇది స్వీయ నిర్భర భారత్ లో అతి పెద్ద అధ్యయనం అనే చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ కేవలం రక్షణ రంగానికే కాదు, దేశ ఆర్థిక, సాంకేతిక, పరిశ్రమల వృద్ధికి కూడా కొత్త అవకాశాలను తెరచబోతోంది.
‘తేజస్’ విజయానికి మరొక మెట్టుపై
ఇప్పటికే HAL (Hindustan Aeronautics Limited) సంస్థ తయారు చేసిన ‘తేజస్’ విమానం భారత వైమానిక రంగానికి గర్వకారణంగా నిలుస్తుంది. ఇది దేశీయంగా తయారు చేసిన మొదటి ఆధునిక యుద్ధ విమానం. అయితే, ఇంతవరకు ఇంజిన్ టెక్నాలజీ విషయంలో భారత్ విదేశాలపై ఆధారపడింది. ఇప్పుడు GE-414 వేరియంట్ ఇంజిన్‌లను భారత్‌లోనే తయారు చేయడం ద్వారా బారత్ పై దిగుమతి భారం తగ్గుతుంది. ఇది దేశ రక్షణ రంగానికి స్వావలంబన వైపు తీసుకెళ్లడంలో అతిపెద్ద మైలురాయిగా చెప్పవచ్చు.
రక్షణ రంగంలో సాంకేతిక..
LCA ప్రాజెక్ట్‌లో అమెరికా భాగస్వామ్యం ద్వారానే టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (Technology Transfer) అంశం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. GE కంపెనీ తయారు చేసి ఇచ్చే ఈ ఇంజిన్ సాంకేతికతతో భారత్‌లోనే ఈ వీటి తయారీ జరగడం సాంకేతిక పరంగా, అభివృద్ధి పరంగా కొత్త దారులను చూపుతోంది. ఇది భవిష్యత్తులో ‘అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’ (AMCA) ప్రాజెక్ట్‌లకు కూడా దోహదం చేయగలదు.
వ్యూహాత్మక అడుగుగా మారుతుందా..?
అమెరికా-భారత్ మధ్య టారీఫ్ ల వార్ జరుగుతుంది. కానీ ఇది రక్షణ రంగంకు పెద్ద ఆటంకంగా నిలవలేదు. ఈ రంగంలో వారితో దోస్తీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. GE ఇంజిన్ ఒప్పందం కేవలం వాణిజ్య పరమైనది మాత్రమే కాదు.. రెండు దేశాల మధ్య కొంతలో కొంత సంకేతం. ఇరుదేశాల ఉమ్మడి ఉత్పత్తులు, సంయుక్త పరిశోధనలు భవిష్యత్‌లో సాంకేతిక ఆధారిత దౌత్యానికి దారితీయనున్నాయి.
సవాళ్లు సైతం లేకపోలేదు..
అయితే, ఈ ప్రాజెక్ట్ లో సవాళ్లు సైతం లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. ఇంజిన్ల తయారీలో నాణ్యత, సమయపాలన, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడం చాలా కీలకం. అలాగే, రక్షణ ఉత్పత్తుల్లో ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే భావన నిలబెట్టుకోవాలంటే స్వదేశీ భాగస్వామ్య సంస్థలు, శిక్షణ కేంద్రాలు మరింత బలోపేతం కావాలి.
ఈ 400 LCA విమానాల తయారీతో భారత్ రక్షణ రంగంలో ఒక కొత్త అధ్యాయాన్ని నమోదు చేసుకుంటుంది. ఇది కేవలం యుద్ధవిమానాల తయారీ మాత్రమే కాదు. ఒక సాంకేతిక విప్లవం. స్వదేశీ పరిశ్రమలకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఎగుమతుల అవకాశాలు కల్పించే శక్తి దీనికి ఉంది. చివరగా.. ఈ ప్రాజెక్ట్ భారత్ ను ‘విశ్వగురువు’గా మార్చగలదని చెప్పవచ్చు.