క్రెడిట్ స్కోర్ 800+.. ఇలా చేస్తేనే సాధ్యం
ఇక.. క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేసే అంశాలతో పాటు.. తగిన జాగ్రత్తలు ఎలా అన్నది చూస్తే..;
కాలం మారింది. అందుకు తగ్గట్లే కొత్త పద్దతులు వచ్చేశాయి. వ్యక్తిగతంగా క్రెడిట్ స్కోర్ ఎంతన్న దానికి అనుగుణంగా బ్యాంకులు అప్పులు ఇవ్వటం మొదలు.. తక్కువ వడ్డీకే ఆఫర్లు ఇవ్వటం తెలిసిందే. ఇంతకూ క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలంటే? 800 ప్లస్ అని చెప్పాల్సిందే. కానీ.. ఈ స్కోర్ సాధించటం అందరికి సాధ్యమయ్యే పని కాదు. చాలామందికి క్రెడిట్ స్కోర్ కు.. సిబిల్ స్కోర్ కు తేడా లేదనుకుంటారు. కానీ.. ఈ రెండింటికి మధ్య తేడా ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు.
ఒకరి క్రెడిట్ స్కోర్ ను లెక్కేసేందుకు పలు సంస్థలు ఉన్నాయి. అందులో ఒకటి సిబిల్. దీని తరహాలోనే ఈక్వి ఫాక్స్, ఎక్స్ పీరియన్, సీఆర్ఐఎఫ్ లాంటి పేర్లతో పలు సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆర్ బీఐ నుంచి అనుమతి తీసుకొని క్రెడిట్ స్కోర్ ను లెక్కేస్తుంటాయి. అయితే.. అత్యధికులు మిగిలిన సంస్థల కంటే కూడా సిబిల్ స్కోర్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు.
అందులో కనిపించే లెక్కనే చాలా ఆర్థిక సంస్థలు ప్రాతిపదికగా తీసుకోవటం కనిపిస్తుంది. దీంతో క్రెడిట్ స్కోర్ అనే పదానికి సిబిల్ గా మారింది. మరింత ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే బట్టలు ఉతకటానికి వాషింగ్ పౌడర్ కావాలి. కానీ.. ఇదే మాటను ఇంగ్లిషులో చెబితే.. సర్ఫ్ అని పలువురు చెబుతుంటారు. లేదంటే ఏరియల్ సర్ఫ్ అనేటోళ్లు ఎలా ఉంటారో అలానే క్రెడిట్ స్కోర్ ను సిబిల్ గా చెప్పేసేటోళ్లు ఉంటారు.
ఇక.. క్రెడిట్ స్కోర్ ను ప్రభావితం చేసే అంశాలతో పాటు.. తగిన జాగ్రత్తలు ఎలా అన్నది చూస్తే..
- సిబిల్ స్కోర్ విషయానికి వస్తే కనిష్ఠంగా 300 గరిష్టంగా 900 వరకు ఉంటుంది. 800 కంటే ఎక్కువ స్కోర్ ఉన్న వారు అద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణ ఉందని భావిస్తుంటారు. 800 స్కోర్ ను దాటేసేటోళ్లు మొత్తంగా 10-20 శాతం మధ్యనే ఉంటారు. ఎక్కువమంది 700-750, 750-800 రేంజ్ లో స్కోర్ ఉండే పరిస్థితి.
- పేమెంట్ హిస్టరీ.. క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో.. క్రెడిట్ హిస్టరీ లెంగ్త్ లాంటి అంశాలు స్కోర్ ను ప్రభావితం చేస్తాయన్నది మర్చిపోవద్దు
- స్కోర్ 800 ప్లస్ ఉండాలంటే ఆర్థిక వ్యవహారాలపై అవగాహనతో పాటు.. సంపన్నులతోపాటు.. మరికొందరు మాత్రమే ఉంటారన్నది మర్చిపోవద్దు
- క్రెడిట్ కార్డు బిల్లులు.. ఈఎంఐలు.. ఇతర రుణాల్ని సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ స్కోర్ లెక్కలోపేమెంట్ హిస్టరీ ప్రభావం 30-35 శాతం ఉంటుంది. సో.. బీకేర్ ఫుల్.
- రుణ పరిమితిలో ఏ మాత్రం వాడుకున్నారో తెలిపేది క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో. దీన్ని ఎప్పుడు 30 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. క్రెడిట్ స్కోర్ లో దీని ప్రభావం 25-30 శాతం మేర ఉంటుంది.
- పాత బ్యాంకు ఖాతాలు.. క్రెడిట్ కార్డుల్ని కంటిన్యూ చేయాలి. పాత కార్డులని రద్దు చేసుకునే విషయంలో తొందరపాటు వద్దు. క్రెడిట్ హిస్టరీ ప్రభావం దాదాపు 15 శాతం ఉంటుంది.
- క్రెడిట్ కార్డు.. పర్సనల్ లోన్,. స్టూడెంట్ లోన్ తో పాటు.. ఇంటి మీద ఉంటే అప్పు.. వాహనం కోసం తీసుకునే రుణం లాంటివి మాత్రమేకాదు.. హామీతో కూడిన అప్పులు తీసుకోవాలి. అప్పుడే క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. అన్ని రకాల అప్పులు తీసుకోవటం ద్వారా పది - పదిహేను శాతం ప్రభావం చేపుతుందన్నది మర్చిపోవద్దు.
- ఒకే సమయంలో కానీ.. తక్కువ వ్యవధిలో ఎక్కువసార్లు.. ఎక్కువ మంది వద్ద రుణం తీసుకోవటానికి అవసరమైన యోగ్యతను చెక్ చేసేందుకు వీలుగా క్రెడిట్ రిపోర్టుల కోసం ప్రయత్నిస్తే.. సిబిల్ స్కోర్ నెగిటివ్ లోకి వెళుతుందన్నది మర్చిపోవద్దు.
- ఎప్పుడూ రుణ సెటిల్ మెంట్ కోసం ప్రయత్నించకండి. ఈ తరహా ప్రయత్నాలు చేస్తే.. 800 ప్లస్ కు చేరుకోవటం అసాధ్యమైనదిగా చెప్పాలి.
- క్రెడిట్ రిపోర్టును తరచూ కాకున్నా.. కొన్ని నెలలకు ఒకసారి చొప్పున చెక్ చేసుకోవటం మంచిది. అలా అని ప్రతి రెండు వారాలకు ఒకసారి.. క్రెడిట్ హిస్టరీ చెక్ చేసుకుంటే స్కోర్ నెగిటివ్ అవుతుందన్నది మర్చిపోవద్దు.