హైదరాబాద్ లో 'ఇంద్రజాల్ రేంజర్' ఆవిష్కరణ.. దీని ప్రత్యేకతలు తెలుసా?
ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనాన్ని హైదరాబాద్ లో ప్రారంభించారు.;
ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ యాంటీ డ్రోన్ గస్తీ వాహనాన్ని హైదరాబాద్ లో ప్రారంభించారు. భారతదేశ సరిహద్దు రక్షణ వ్యూహానికి గణనీయమైన అప్ గ్రేడ్ లో భాగంగా... 26/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించే విధంగా ఈ రోజు మొట్టమొదటి యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ (ఏడీపీవీ) 'ఇంద్రజాల్ రేంజర్'ను ప్రారంభించినట్లు సంస్థ ప్రకటించింది.
అవును... మొట్టమొదటి యాంటీ డ్రోన్ పెట్రోల్ వెహికల్ "ఇంద్రజాల్ రేంజర్"ను ఈ రోజు రాయదుర్గం టీ హబ్ లో ఆవిష్కరించారు. రాయదుర్గం టీ హబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ దేవేంద్ర ప్రతాప్ పాండే హాజరయ్యారు. భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర, వీటిని నిర్వీర్యం చేసే విషయంలో తాజా ఇంద్రజాల్ రేంజర్ పనితీరుపై ఆయన స్పందించారు.
ఇందులో భాగంగా... భవిష్యత్తులో యుద్ధాలు కేవలం ఆయుధాలతో మాత్రమే ఉండవని.. ఈ సమయంలో డ్రోన్స్ పాత్రం అత్యంత కీలకంగా మారి, ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. ఈ క్రమంలో.. పాకిస్థాన్ నుంచి పలుమార్పు దేశంలోకి డ్రోనను పంపారని.. అయితే వాటిని మన బలగాలు నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ఇంద్రజాల్ రేంజర్ పని తీరును వివరించారు.
దేశంలోకి ప్రవేశించే అనుమానాస్పద డ్రోన్ లను ఇంద్రజాల్ రేంజర్ కూల్చుతుందని.. ఇది కచ్చితంగా చాలా కీలకమైన అడుగని ప్రతాప్ పాండే అన్నారు. ఈ సందర్భంగా... ఇంద్రజాల్ సంస్థను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇది దేశ భద్రత విషయంలో కీలక ముందడుగని అన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఇంద్రజాల్ సంస్థ ఈసీఓ, వ్య్యవస్థాపకుడు కిరణ్ రాజు... ఈ ఆవిష్కరణ వెనుక ఉన్న లక్ష్యాన్ని నొక్కి చెప్పారు. ఇందులో భాగంగా... ప్రతీ డ్రోన్ ను తటస్తీకరించడం అంటే ఎన్నో జీవితాలను రక్షించడమేనని.. భారతదేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడమేనని అన్నారు. ఇది తమ ప్రాథమిక లక్ష్యమని వెల్లడించారు.
ఇదే సమయంలో... భారతదేశంలోని యువత డ్రగ్స్ పై ఉపయోగించే నిధులు పాక్ ఉగ్ర ముఠాలకు వెళ్తున్నాయని.. ఇవి సరిహద్దు రాష్ట్రాల ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. ఇతర దేశాలతో భారత్ కు సుమారు 15,000 కిలోమీటర్ల భూసరిహద్దు ఉందని చెప్పిన కిరణ్ రాజు... ఈ క్రమంలో డ్రగ్స్ ట్రాఫికింగ్ పెద్ద సమస్యగా మారిందని.. ఈ సమస్య నుంచి పుట్టిందే ఈ రేంజర్ అని తెలిపారు.
వాస్తవానికి ఇది కేవలం డిఫెన్స్ డ్రోన్స్ కోసం మాత్రమే కాదని చెప్పిన కిరణ్ రాజు.. దేశంలోకి డ్రగ్స్ తీసుకువస్తున్న డ్రోన్స్ ను నిర్వీర్యం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది సుమారు 10 కిలోమీటర్ల రేడియస్ లో పని చేస్తుందని.. పరీక్షా సమయంలో 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని.. ఇది పూర్తిగా హ్యాకింగ్ మెకానిజంతో సైబర్ ట్రిగ్గర్ విధానంలో పని చేసుందని తెలిపారు.
ఇక ఇద్రజాల్ రేంజర్ ఆవిష్కరణకోసం 26/11 నే ఎంచుకోవడానికి గల కారణాన్ని కిరణ్ రాజు వెల్లడించారు. ఇందులో భాగంగా... 26/11 ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించేందుకు ఈ తేదీని ఎంచుకున్నట్లు తెలిపారు.