పొలిటికల్ టాక్: ఇప్పుడైనా బనకచర్ల ప్రాధాన్యం గుర్తిస్తారా?
ఇదేసమయంలో ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు విషయంపై చర్చ జరుగుతోంది.;
భాగ్యనగరం హైదరాబాద్ మునిగిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ నది కట్టలు తెంచు కుని నగరంపై పడింది. దీంతో ఉప నదులైన మంజీరా సహా ఇతర ప్రాజెక్టుల్లో నీరు ఉవ్వెత్తున ఉరకలు వేస్తోంది. దీంతో హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతం ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ఈ పరిణామాలకు చెక్ పెట్టడం ఎలా? అనేది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అంతర్మథనం చెందుతోంది. అయితే.. పరిష్కారం లభించడం లేదు.
ఇదేసమయంలో ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు విషయంపై చ ర్చ జరుగుతోంది. వృథాగా సముద్రంలో కలుస్తున్న వెయ్యి టీఎంసీల నీటిలో తాము 200 టీఎంసీలను ఎత్తిపోసి.. బనకచర్ల ద్వారా.. రాయలసీమకు నీటిని అందిస్తామని.. ఇంకా ఉంటే.. తెలంగాణకు కూడా ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటోంది. వాస్తవానికి.. ఎక్కడ ఏ చుక్క నీరు పెరిగినా.. దాని ని బనకచర్లకు తరలించే అవకాశం ఉంటుందని కూడా చెబుతున్నారు.
ఎలాగంటే.. గోదావరిలో వృథాగా పోయే నేటీని పోలవరం నుంచి బనకచర్లకు తరలిస్తారు. ఒకవేళ ఇప్పుడు తలెత్తిన మూసీ, మంజీరా నదుల ద్వారా పెరిగే నీటిని కృష్ణానదిలోకి తోడిపోసి.. అటు నుంచి బనకచర్లకు తరలిస్తారు. కృష్ణా నీటిని ముట్టుకోరు. ఈ నదిలోకి తోడిపోసిన నీటిని మాత్రమే వినియోగిస్తారు. తద్వారా.. ఎగువ రాష్ట్రంలో వరదలకు అడ్డుకట్ట పడుతుంది. ఈ విషయాన్నే చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. తాజాగా తలెత్తిన హైదరాబాద్ వరద సమస్యకు.. బనకచర్లతో కొంత వరకు చెక్ పెట్టవచ్చని కూడా ఆయన తెలిపారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బనకచర్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు.. అవసరమైతే.. అంటూ..చంద్రబాబే దిగివచ్చి ఇచ్చిన ఆఫర్‌ను వినియోగించుకుని.. బనకచర్లలో వాటా కోరినా.. ప్రభుత్వం ఒప్పుకొనేందుకు సిద్ధంగానే ఉంది. ఈ పరిణామాలను అంచనా వేసుకుని తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంటే.. ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు. దీనిపై నిర్ణయం తీసుకుం టే.. కరువు పీడిత తెలంగాణ రాష్ట్రాలకు కూడా నీరు అందించే అవకాశం ఉంటుందని అంటున్నారు.