ఎస్ఆర్ నగర్ మెట్రో మూసి ఉన్న వేళలో.. మంటల్లో ట్రావెల్ బస్సు
దీంతో ఒక ప్రమాదం తప్పిందనుకున్న వేళ.. బస్సు మంటలు పెద్ద ఎత్తున రేగటంతో.. భారీగా పొగ ఆ ప్రాంతం మొత్తాన్ని కమ్మేసింది.;
త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఊహించేందుకు సైతం చెమటలు పట్టే ఈ ఉదంతం రాత్రి వేళ.. బాగా పొద్దుపోయిన తర్వాత చోటు చేసుకోవటంతో వందలాది ప్రయాణికులకు ప్రమాదం తప్పినట్లైంది. ఇంతకూ అసలేమైందంటే.. హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కింద భాగంలో రోడ్డు మీద వెళుతున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకోవటం.. అది పూర్తిగా కాలిపోయింది.
ఈ టైంకు ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు రేగటాన్ని గుర్తించిన బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తం చేసి.. అందులోని ప్రయాణికుల్ని బయటకు సురక్షితంగా తీసుకెళ్లారు. దీంతో ఒక ప్రమాదం తప్పిందనుకున్న వేళ.. బస్సు మంటలు పెద్ద ఎత్తున రేగటంతో.. భారీగా పొగ ఆ ప్రాంతం మొత్తాన్ని కమ్మేసింది.
అయితే.. అప్పటికే మెట్రో రైల్వే స్టేషన్ పని వేళలు ముగిసిపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. లేని పక్షంలో ఈ మంటలతో ఏర్పడిన దట్టమైన పొగతో మెట్రో రైలుకు పని చేసే సిబ్బందితో పాటు.. ప్రయాణికులు సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. అయితే.. అర్తరాత్రి వేళకు కాస్త ముందుగా ఈ ప్రమాదం చోటు చేసుకోవటంతో ఎంతో లక్కీగా చెప్పాలి. ఎందుకంటే.. నడుస్తున్న బస్సులో మంటలు రేగటంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్రమైన భయాందోళనలకు గురయ్యారు.
అయితే.. వెంటనే స్పందించిన డ్రైవర్ ప్రయాణికుల్ని.. బస్సులో నుంచి దించేయటంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ ఘటనతో కూకట్ పల్లి - అమీర్ పేట మార్గం భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. బస్సు ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. బస్సు ప్రమాదానికి ముందే మెట్రో రైలు సేవలు ముగిశాయి ఈ మంటలతో ఏర్పడిన దట్టమైన పొగ స్టేషన్ మొత్తాన్ని కమ్మేసింది.