ఒంటరికి జంతువే తోడు!... డబ్ల్యూ.హెచ్‌.ఓ హెచ్చరికలివే!

ఈ టెక్నాలజీ యుగంలో ప్రపంచం ఓ కుగ్రామం మాదిరి మారిందని చెబుతుంటారు.

Update: 2024-05-22 17:30 GMT

ప్రేమలో విఫలమైన దేవదాసు గుర్తుకు వస్తే... ఆయన చేతిలో 'బాటిల్' సంగతి కాసేపు పక్కనపెడితే... పక్కన ఒక మూగజీవి మాత్రం కచ్చితంగా ఉంటుంది. ఒంటరైన అతనికి మూగజీవే తోడుగా ఉంటుంది. అయితే అది కేవలం సినిమాల్లో మనం చూసిన దేవదాసుకు మాత్రమే కాదు.. ఇప్పటి రోజుల్లో ఒంటరైన ప్రతీ మనిషికీ పెంపుడు జంతువులే ఆధారమవుతున్నాయని అంటున్నారు!

ఈ టెక్నాలజీ యుగంలో ప్రపంచం ఓ కుగ్రామం మాదిరి మారిందని చెబుతుంటారు. ఇదే సమయంలో ఈ కుగ్రామంలో సైతం మనిషి ఒంటరైపోతున్నాడు! మనసుకు నచ్చిన వారు దొరక్కో, దొరికినవారు మనసును అర్ధం చేసుకోకో.. కారణం ఏదైనా ప్రపంచంలో మనుషుల ఒంటరి తనంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్‌.ఓ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆద్మోళన వ్యక్తం చేసింది.

అవును... మనుషుల్లో ఒంటరితనం పెరిగిపోతుందని అంటున్నారు. ఈ మేరకు ఈ విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా హెచ్చరికలు జారీచేసింది. ఇది మనిషి ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే... మనిషి తన ఒంటరితనం నుంచి బయటపడేందుకు ఎంచుకుంటున్న మార్గాలపైనా గణాంకాలు తెరపైకి వస్తున్నాయి.

వివరాళ్లోకి వెళ్తే... ప్రపంచంలో మనిషి రోజు రోజుకీ ఒంటరైపోతున్నాడు. అయితే ఈ ఒంటరితనం నుంచి బయట పడేందుకు భారతీయులు మాత్రం పెంపుడు జంతువుల్ని పెంచుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలో సగటున భారతీయ కుటుంబాలు పెంపుడు జంతువుల కోసం సగటున రూ.3 వేలు ఖర్చు చేస్తుండగా.. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రూ.5 వేల వరకు పెట్స్‌ కోసం కేటాయిస్తున్నారని అంటున్నారు.

Read more!

ఫలితంగా దేశీయంగా పెట్‌ కేర్‌ రంగం ప్రస్తుత విలువ ఐదువేల కోట్ల రూపాయలు ఉంటే... 2028 నాటికి ఆ మొత్తం రూ.10వేల కోట్లుకు చేరుతుందని అంచనా చేస్తున్నారు. పైగా పెంపుడు జంతువుల పాపులేషన్ లో ప్రస్తుతం ఐదవ స్థానంలో నిలిచింది. కాగా... భారత్‌ లో 31 మిలియన్ల పెంపుడు కుక్కలు, 2.44 పెంపుడు పిల్లులు ఉన్నాయని చెబుతున్నారు.

ఇక పెంపుడు జంతువులను సంరక్షించే విషయంలో వాటి వాటి యజమానులను వాటిని సొంత తల్లితండ్రుల భావనతో చూస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే జంతువులకు కేటాయించే ఆహారం, గ్రూమింగ్‌ తో పాటు కేఫ్‌ లు, ఇన్సూరెన్స్ ఇలా వాటి సంరక్షణ కోసం ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదని చెబుతున్నారు.

Tags:    

Similar News