ఐటీ ఉద్యోగులపై హెచ్ ఐవీ పంజా

వీకెండ్ పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తుండటం.. ఎక్కువమందితో శారీరక సంబంధాలు.. డ్రగ్స్ మద్యం మత్తులో అరక్షిత శ్రంగారంలో పాల్గొనటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.;

Update: 2025-12-01 05:31 GMT

ఐటీ రంగానికి చెందిన ఉద్యోగుల్లో హెచ్ఐవీ కేసులు ఎక్కువగా నమోదవుతున్న షాకింగ్ నిజం ఒకటి వెలుగు చూసింది. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో ఐటీ ఉద్యోగుల్లో పెరిగిన కొత్త జాడ్యం ఇప్పుడు సంచలనంగా మారింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఐటీ రంగానికి చెందిన వారిలో హెచ్ఐవీ సంక్రమణ శాతం పెరుగుతుందన్న విషయాన్ని నివేదికలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలు అప్రమత్తంగా ఉండాలని ..ఈ రంగానికి చెందిన వారికి హెచ్ఐవీ పరీక్షలసంఖ్య పెంచాలన్న సూచన చేసింది.

మొత్తంగా చూస్తే.. హెచ్ఐవీ వ్యాప్తి కేసులు తగ్గినప్పటికి.. ఐటీ రంగంతో పాటు వ్యవసాయ కూలీల్లో మాత్రం స్వల్పంగా పెరుగుదల నమోదైన విషయాన్ని గుర్తించారు. తెలంగాణ విషయానికి వస్తే.. గత ఏడాదితో పోలిస్తే ఈసారి హెచ్ఐవీ సంక్రమణ కేసుల రేటు 0.44 నుంచి 0.41కు తగ్గినట్లు పేర్కొన్నారు. ఐటీ రంగంలో హెచ్ఐవీ కేసులు పెరుగుదలకు కారణం విదేశీ జీవనశైలిని అనుసరించటమని చెబుతున్నారు.

వీకెండ్ పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తుండటం.. ఎక్కువమందితో శారీరక సంబంధాలు.. డ్రగ్స్ మద్యం మత్తులో అరక్షిత శ్రంగారంలో పాల్గొనటం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. దీనికి తోడు ఒకరు వాడిన డ్రగ్స్ ఇంజెక్షన్లను మరొకరు వాడటం లాంటివి హెచ్ ఐవీ వ్యాప్తికి కారణమన్న మాట వినిపిస్తోంది. గర్భం రాకుండా ఉండేందుకు చాలామంది కండోమ్ లు వాడేవాడని.. కానీ రొమాన్స్ తర్వాత కూడా వేసుకోగలిగిన ఐపిల్ తరహాలో తక్షణ గర్భనిరోధక మాత్రలు అందుబాటులోకి రావటంతో అరక్షిత రొమాన్సు ఎక్కువైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News