ప్రపంచంలో విద్యుత్ ఎక్కువగా వాడే దేశాలు ఇవే.. ఇండియా స్థానం ఎంతంటే?

మరి ఈ రేసులో ప్రపంచంలోనే అత్యధికంగా కరెంట్ వాడుతున్న దేశాలు ఏవి? మన భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఏ దేశం ఎంత కరెంట్ వినియోగిస్తుందో ఇప్పుడు చూద్దాం..

Update: 2026-05-26 07:18 GMT

ఈ రోజుల్లో కరెంట్ లేకపోతే ఒక్క నిమిషం కూడా గడవడం కష్టం. స్మార్ట్‌ఫోన్లు, ఏసీలు, ఈవీ వాహనాలు, ఇంటర్నెట్ వాడకం పెరిగిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వినియోగం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. మరి ఈ రేసులో ప్రపంచంలోనే అత్యధికంగా కరెంట్ వాడుతున్న దేశాలు ఏవి? మన భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఏ దేశం ఎంత కరెంట్ వినియోగిస్తుందో ఇప్పుడు చూద్దాం..

టాప్ లో చైనా.. తిరుగులేని రికార్డ్:

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుత్‌ను ఉపయోగిస్తున్న దేశంగా చైనా మొదటి స్థానంలో నిలిచింది. 2025 లెక్కల ప్రకారం ఈ దేశం ఏకంగా 10,573 టెరావాట్-గంటల కరెంట్‌ను వాడేసింది. ఇక చైనాను 'ప్రపంచ ఫ్యాక్టరీ' అంటారు కదా, అక్కడ ఉన్న భారీ పరిశ్రమలు, తయారీ రంగాలు రాత్రి పగలు తేడా లేకుండా నడవడమే ఈ భారీ వినియోగానికి ప్రధాన కారణం.

రెండో స్థానంలో అమెరికా జోరు:

అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ ఏడాదికి సుమారు 4,500 టెరావాట్-గంటల విద్యుత్ వినియోగం జరుగుతోంది. ఇక అమెరికాలోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఆఫీసులు, నెట్ ఇంటర్నెట్ నడిపించే డేటా సెంటర్లు మరియు ఇళ్లలో వాడే అధునాతన గ్యాడ్జెట్ల వల్ల అక్కడ కరెంట్ డిమాండ్ ఎప్పుడూ హై లెవల్లోనే ఉంటుంది.

మూడో స్థానంలో మన భారత్:

అవును, విద్యుత్ వినియోగంలో మన భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద దేశంగా అవతరించింది. ఇక 2025లో భారత్ 2,000 టెరావాట్-గంటలకు పైగా విద్యుత్‌ను ఉపయోగించింది. మన దేశంలో పెరుగుతున్న జనాభా, వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పల్లె పల్లెకూ కరెంట్ కనెక్షన్లు రావడం, ఇళ్లలో ఏసీలు, ఫ్రిజ్‌ల వాడకం పెరగడం వల్లే మన దగ్గర డిమాండ్ భారీగా పెరిగింది.

రష్యా, జపాన్ కూడా రేసులోనే..:

ఇక నాలుగైదు స్థానాల్లో రష్యా, జపాన్ దేశాలు ఉన్నాయి. రష్యాలో విపరీతమైన చలి ఉంటుంది కాబట్టి ఇళ్లను వేడిగా ఉంచడానికి, అక్కడి భారీ పరిశ్రమల కోసం ఏటా 1,100 నుండి 1,200 టెరావాట్-గంటల కరెంట్ వాడుతున్నారు. సాంకేతికతలో ముందుండే జపాన్ తన పరిశ్రమల కోసం ఏటా దాదాపు 1,000 టెరావాట్-గంటల విద్యుత్‌ను వినియోగిస్తోంది.

కాలుష్యంపై భారత్ పోరాటం:

కరెంట్ వాడకం పెరిగితే పర్యావరణానికి ముప్పు తప్పదు. ఎందుకంటే ఎక్కువ కరెంట్ బొగ్గును కాల్చడం వల్లే వస్తుంది. అందుకే మన భారత్ ఇప్పుడు తెలివిగా పునరుత్పాదక శక్తి (గ్రీన్ ఎనర్జీ) వైపు అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టులను పెంచుకుంటూ పోతోంది.

రాబోయే రోజుల్లో డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు ఇంకా పెరిగిపోతాయి కాబట్టి కరెంట్ డిమాండ్ మరింత పెరగడం ఖాయం. భవిష్యత్తులో ఈ డిమాండ్‌ను అందుకోవాలంటే భారత్, చైనా, అమెరికా లాంటి దేశాలు పర్యావరణానికి హాని చేయని పద్ధతుల్లో విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచుకోవాల్సి ఉంటుంది అంటున్నారు నిపుణులు

Tags:    

Similar News