తనయుల రాజకీయంతో తండ్రులకు బ్యాడ్ నేమ్ ..!
ఈ కోణంలో చూసుకుంటే.. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో తండ్రికి తగ్గ తనయులుగా రాజకీయాల్లోకి వచ్చి నా.. తండ్రి స్థాయికి ఎదుగుతున్న నాయకుల సంఖ్య తక్కువగానే ఉంది.;
తండ్రుల వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన తనయులు ఏమేరకు వారికి దీటుగా పనిచేస్తున్నారు. ఎం త వరకు తండ్రుల పేరును నిలబెట్టే పనులు చేస్తున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. నిజానికి తండ్రుల వారసత్వంతో రాజకీయాలు చేయడం, రాజకీయాల్లోకి రావడం కొత్తకాదు. కానీ, తండ్రికి తగ్గ తన యులుగా గుర్తింపు పొందడంలోనూ.. వారికి అనుగుణంగా రాజకీయాలు చేయడంలోనూ మాత్రం విభిన్నం గా మారింది. భిన్నమైన పంథాలు ఎంచుకోవడం తప్పుకాదు. కానీ, భిన్నమని చెబుతూనే.. తప్పులు చేయడం సరికాదు.
ఈ కోణంలో చూసుకుంటే.. ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో తండ్రికి తగ్గ తనయులుగా రాజకీయాల్లోకి వచ్చి నా.. తండ్రి స్థాయికి ఎదుగుతున్న నాయకుల సంఖ్య తక్కువగానే ఉంది. ఉదాహరణకు... నియోజకవర్గం లో తండ్రి చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలి. తండ్రి ఎవరిని ఆదరించారో..ఏయే రంగాలపై పట్టుపెంచుకునేలా చేశారో.. వాటిని తనయులు కూడా అందిపుచ్చుకునేలా ఉండాలి. తద్వారా రాజకీ యాల్లో ఎదిగేందుకు ముందుకు సాగాలి. ఇది భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది.
కానీ, ఈ రకంగా చూసుకుంటే.. రాష్ట్రంలో నలుగురు తనయులు దారి తప్పుతున్నారు. తండ్రి పేరుతో, ఫొటోతో రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు.. సొంతగా పార్టీ పెట్టుకున్న జగన్ నుంచి టీడీపీలో ఎమ్మెల్యే లుగా ఉన్న వారి వరకు కూడా.. అందరూ ప్రశ్నల చట్రంలో నిలబడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. ఆయన పేరుతోనే రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. అయితే.. ఆయనలా.. మాత్రం జగన్ లేరన్నది సొంత పార్టీ నేతలే చెబుతున్న మాట. ఇది జగన్ కు మైనస్‌గా మారిపోయింది.
ఇక, ప్రస్తుత ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. తొలిసారి విజయం దక్కించుకున్న వీరంతా.. దూకుడుగా ఉంటున్నారు. ఇది మంచిదే అయినా.. వివాదాలకు కేంద్రంగా వారు వ్యవహరిస్తున్నారు. ఇదే పెద్ద మైనస్‌గా మారుతోంది. తండ్రి చేసిన మంచిని అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారు. అదేసమయంలో సొంత అజెండాలు వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఫలితంగా ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు ఇలా లేదు. ప్రత్యర్థులను కూడా అక్కున చేర్చుకున్న రాజకీయాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా సాగుతున్నాయి. దీనిని బట్టి తనయులు మారాల్సిన అవసరం ఉంది.