జీవీఎల్ విత్ లోకేష్....మాజీ ఎంపీ ఫ్యూచర్ ప్లాన్స్ !

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యసభ పదవులు భర్తీ చేశారు. వాటిని జీవీఎల్ ఆశించారు అని ప్రచారం సాగింది.;

Update: 2025-11-09 04:46 GMT

ఏపీకి చెందిన బీజేపీ నాయకుడు జీవీఎల్ నరసింహారావు గత అయిదేళ్ళూ కీలకంగా ఉండేవారు. మీడియాలోనూ ఆయన హైలెట్ అవుతూ ఒక రేంజిలో ఫోకస్ అయ్యేవారు. ఆయన ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ అయినా ఏపీ తన కార్యక్షేత్రంగా చేసుకుని 2024 ఎన్నికలను టార్గెట్ చేశారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆయన ఎంతో ఆశించారు. కానీ అసలు కుదరలేదు, పైపెచ్చు అనకాపల్లి ఎంపీ సీటు బీజేపీకి ఇచ్చారు. దానికి రాయలసీమ నుంచి వచ్చిన సీఎం రమేష్ తీసుకున్నారు. అలా జీవీఎల్ లోక్ సభ సీటూ పోటీ రెండూ కలగానే మిగిలిపోయాయి.

ఆ విమర్శలతో :

మరో వైపు చూస్తే జీవీఎల్ మీద కూటమి నేతలకు అనుమానాలు ఉన్నాయని చెబుతారు. ఆయన వైసీపీకి మద్దతుగా గడచిన అయిదేళ్ళూ వ్యవహరించారు అని కూడా అంటారు. ఆయన ఎక్కువగా చంద్రబాబుని టార్గెట్ చేసి విమర్శలు చేసేవారు. దాంతో కూడా ఆయన మీద అనుమానాలు ఎక్కువ అయిపోయాయి.ఇవన్నీ కలసి ఆయన రాజకీయానికి 2024 ఎన్నికల తరువాత బ్రేక్ వేశాయి. అయితే ఆ తరువాతనే జీవీఎల్ కూడా వీటిని అన్నింటినీ సమీక్షించుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు.

ఆ పదవులు కోరినా :

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజ్యసభ పదవులు భర్తీ చేశారు. వాటిని జీవీఎల్ ఆశించారు అని ప్రచారం సాగింది. అంతే కాకుండా ఎమ్మెల్సీగా చాన్స్ అయినా దక్కుతుందని భావించారు అంటారు, ఇక ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ రేసులోనూ ఆయన ఉన్నారని అంటారు. అయితే ఇవేమీ జరగకపోగా ఆయన మాజీ ఎంపీగా బీజేపీలో సైలెంట్ గా ఉండిపోయారు. ఇక జీవీఎల్ తన రాజకీయాన్ని మలుపు తిప్పుకోవడానికి కొత్త ప్రయత్నాలు మొదలెట్టారని అంటున్నారు.

లోకేష్ వెంట :

బీహార్ లో ఎన్డీయే తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి ఏపీ నుంచి నారా లోకేష్ ని ఎన్డీయే కూటమి పెద్దలు ఆహ్వానించారు. అలా లోకేష్ బీహార్ వెళ్తే ఆయన వెంట జీవీఎల్ నరసింహారావు కనిపించారు. ఆయన లోకేష్ తోనే ఉండడంతో దాని మీద చర్చ మొదలైంది. జీవీఎల్ చినబాబుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా తన రాజకీయానికి కొత్త దారులు వెతుక్కుంటున్నారా అని కూడా చర్చ సాగుతోంది. ఏపీలో కూటమి సారధి టీడీపీ. టీడీపీ అంటే చంద్రబాబు లోకేష్. ఏ పదవులు దక్కలన్నా ఏ నామినేటెడ్ పోస్టులు చిక్కాలన్నా టీడీపీ అధినాయకత్వం బ్లెస్సింగ్స్ ఉండాల్సిందే. దాంతో ఆ వైపు నుంచి గ్యాప్ లేకుండా జీవీఎల్ తనదైన ప్రయత్నాలు మొదలెట్టారా అన్నది కూడా చర్చగా ఉంది. . బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎంత ఉన్నా టీడీపీలో అధినాయకత్వం ప్రసన్నత కూడా అవసరమని జీవీఎల్ గుర్తెరిగారు అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఈ మాజీ మంత్రి పొలిటికల్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారని మరి అది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాలి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News