రేంజ్ రోవర్ ప్రియులకు శుభవార్త.. నిజం తెలిస్తే ఎగిరిగంతేస్తారు!
జీఎస్టీ లో గణనీయంగా మార్పులు తీసుకురావడం వల్ల.. చాలా వస్తువులపై ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే.;
జీఎస్టీ లో గణనీయంగా మార్పులు తీసుకురావడం వల్ల.. చాలా వస్తువులపై ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే. ఇక మిగతా వస్తువుల సంగతి పక్కన పెడితే.. ముఖ్యంగా కారు ధరలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తగ్గిన ధరలు సెప్టెంబర్ 22 నుండి అందుబాటులోకి వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చాలా వాహన తయారీ సంస్థలు సెప్టెంబర్ 22 నుండి తగ్గిన జీఎస్టీ అమలులోకి రాబోతూ ఉండగా.. సెప్టెంబర్ 6 నుండే మహీంద్రా కంపెనీ మాత్రం వినూత్నమైన ఆలోచనతో అతి తక్కువ ధరలకే తమ SUV కారులను వినియోగదారులకు అందివ్వడానికి సిద్ధమైన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా ఇప్పుడు జీఎస్టీ రేట్ల తగ్గుదలతో ఈ ప్రయోజనాన్ని కొనుగోలుదారులకు బదిలీ చేయడంలో భాగంగా రేంజ్ రోవర్ కూడా తన కష్టమర్లకు ఒక శుభవార్తను తెలిపింది. జాగ్వార్ లాండ్ రోవర్ తన వాహన మోడళ్ల ధరను రూ.4.5 లక్షల నుండి ఏకంగా రూ.30.4 లక్షల వరకు తగ్గించింది. ప్రస్తుతం ఈ రేట్ల తగ్గింపును తక్షణమే అమలులోకి తెచ్చినట్లు కూడా తెలిపింది. ఈ విషయం తెలిసి కష్టమర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా రేంజ్ రోవర్ పై రూ.30.4 లక్షల వరకు తగ్గుదల ఉంటుందని స్పష్టం చేయడంతో అభిమానులు ఎగిరి గంతేయడమే కాకుండా ఇప్పుడు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ రేంజ్ రోవర్లో డిఫెండర్ ధర రూ.7 -18.60 లక్షలు, డిస్కవరీ ధర రూ.4.5 - రూ.9.90 లక్షల మేర తగ్గాయి.
రేంజ్ రోవర్ తో పాటు ఈనెల 22 నుండి బజాజ్ ఆటో, హోండా కార్స్ ఇండియా ,వోల్వో కార్ ఇండియా, జీప్ ఇండియా తగ్గించిన కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.
వోల్వో కార్ ఇండియా తన వాహన మోడల్ ధరలను రూ. 6.9 లక్షల వరకు తగ్గించనున్నట్లు తెలిపింది. నీ హోండా కార్స్ ఇండియాకు చెందిన కాంపాక్ట్ సెడాన్ ధర రూ.95,000 వరకూ ధర తగ్గగా.. సిటీ మోడల్ ధర రూ.57,500, ఎలివేట్ ధర రూ.58,400 వరకు తగ్గినట్లు సమాచారం.
కేటీఎం మోడల్స్ విషయానికి వస్తే.. ఈ మోడల్స్ తో పాటు మోటార్ సైకిల్ మోడల్స్ ధరలను కూడా తగ్గించారు. ద్విచక్ర వాహనాలపై రూ.20,000 త్రి చక్ర వాహనాలపై రూ.24 వేల వరకు తగ్గించనున్నట్లు బజాజ్ ఆటో తెలిపింది.
జీప్ ఇండియా వాహన మోడల్స్ అయిన కంపాస్, గ్రాండ్ చెరోకి, ర్యాంగ్లర్, మెరీడియన్ వంటి మోడల్స్ పై రూ.1.26 లక్షల నుండీ రూ.4.8 లక్షల వరకు ధరలు తగ్గనున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు వాహనాలపై ఈ రేంజ్ లో ధరలు తగ్గించడం నిజంగా సామాన్యుడికి మరింత ఊరట కలిగింది అని చెప్పవచ్చు.