వైసీపీ మాజీ మంత్రికి.. గౌతు పేరు చెబితే చాలు.. చ‌లీజ్వ‌ర‌మేన‌ట‌!

టీడీపీ నాయ‌కురాలు, ఫైర్ బ్రాండ్ నేత‌గా పేరున్న గౌతు శిరీష చేతిలో ఘ‌రో ప‌రాజ‌యం పొందారు.;

Update: 2025-04-27 14:30 GMT

శ్రీకాకుళం జిల్లా ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. సీదిరి అప్ప‌ల‌రాజు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఆయ‌న మాట కూడా వినిపించ‌డం లేదు. స‌హ‌జంగా చాలా మంది వైసీపీ నాయ‌కులు మౌనంగానే ఉన్నారు. ఎక్క‌డావారి వాయిస్ వినిపించ‌డం లేదు. కానీ.. సీదిరి అప్ప‌ల‌రాజు మాత్రం అంద‌రి వంటి నాయ‌కుడు కాదు. ఆయ‌న స్ట‌యిల్ వేరేగా ఉంటుంది. అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా.. ఆయ‌న రాజ‌కీయ వ్యంగ్యాలు, విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు.

గ‌తంలో వైసీపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టినుంచి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా.. సీదిరి త‌న‌దైన శైలి లో రాజ‌కీయాలు చేశారు. ముఖ్యంగా స్థానిక పాలిటిక్స్ నుంచి స్టేట్ పాలిటిక్స్ వ‌ర‌కు కూడా.. సీదిరి స్పందించ‌ని రాజ‌కీయ అంశం లేదు. ఈ క్ర‌మంలోనే.. వైసీపీ అధినేత‌, అప్ప‌టి సీఎంజ‌గ‌న్‌.. సీదిరికి.. మంత్రి పోస్టు కూడా.. ఇచ్చార‌న్న చ‌ర్చ ఉంది. అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు. టీడీపీ నాయ‌కురాలు, ఫైర్ బ్రాండ్ నేత‌గా పేరున్న గౌతు శిరీష చేతిలో ఘ‌రో ప‌రాజ‌యం పొందారు.

ఇక‌, అప్ప‌టి నుంచి ఒక‌టి రెండు సార్లు(ప‌ది నెల‌ల కాలంలో) మాత్ర‌మే మీడియా ముందుకు వ‌చ్చిన సీదిరి.. ఆ త‌ర్వాత ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీనిపై ప‌లాస‌లో పెద్ద ఎత్తునే చ‌ర్చ సాగుతోంది. అయితే.. ఒక‌టి.. ఎమ్మెల్యే శిరీష అంటే.. సీదిరికి చ‌లీ జ్వ‌రం ప‌ట్టుకుంద‌ని.. ప్ర‌చారం జ‌రుగుతోంది. మంత్రిగా ఉ న్నప్పుడు.. ఆయ‌న `నొక్కుడు` వ్య‌వ‌హారం అంతా.. ఎమ్మెల్యే శిరీష సేక‌రించార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతు న్నా యి. దీంతో ఇప్పుడు సీదిరి ఏమాత్రం నోరు జారినా.. ఎమ్మెల్యే భ‌ర‌తం ప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నా రు. అందుకే మౌనంగా ఉంటున్న‌ట్టు చ‌ర్చించుకుంటున్నారు.

ఇక‌, రెండోది.. సొంత సామాజిక వ‌ర్గ‌మే.. సీదిరిని వెలి వేసింద‌ని అంటున్నారు. ఎన్నిక‌లు రెండేళ్ల ముందు మంత్రి అయిన సీదిరి.. త‌న సామాజిక వ‌ర్గంలోనే చిచ్చు పెట్టుకున్నార‌ని వైసీపీ నాయ‌కులే చెబుతున్నా రు. దీంతో ఒకానొక సంద‌ర్భంలో సీదిరిని మంత్రి వ‌ర్గం నుంచి త‌ప్పించాల‌ని మ‌త్స్య‌కార వ‌ర్గానికి చెందిన వైసీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. ఈ ప్ర‌భావ‌మే ఆయ‌న‌ను ఎన్నిక‌ల్లో మ‌ట్టి క‌రిపించింద‌ని అంటున్నారు.

ఇప్పుడు.. కూడా మ‌త్స్య‌కార వ‌ర్గం.. సీదిరిని ఏమాత్రం లెక్క చేయ‌డం లేద‌ని.. అందుకే.. ఆయ‌న ఎవ‌రికీ మొహం చూపించ‌లేక పోతున్నార‌ని స‌మాచారం. మొత్తానికి డ‌బ్బాలో రాళ్లేసిన‌ట్టు గ‌డ‌గ‌డా మీడియా ముందుకు వ‌చ్చే.. సీదిరి..ఇ ప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News