బెల్లిడ్యాన్స్ లు.. పాటల హోరు.. అప్పుడే మంటలు.. గోవా ప్రమాద వీడియో వైరల్

గోవాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అర్పోరాలో ఉన్న ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్ అగ్నికి ఆహుతి అయ్యి 25 మంది ప్రాణాలను బలితీసుకుంది.;

Update: 2025-12-07 19:13 GMT

గోవాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అర్పోరాలో ఉన్న ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్ అగ్నికి ఆహుతి అయ్యి 25 మంది ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అనేక మంది గాయపడ్డారు.

అగ్ని ప్రమాద వీడియో వైరల్

అగ్నిప్రమాద సమయంలో నైట్ క్లబ్ లో ‘బాలీవుడ్ బ్యాంగర్ నైట్’ అనే కార్యక్రమం జరుగుతోంది. ‘షోలే’ సినిమాలోని ప్రముఖ పాట ‘మెహబూబా ఓ మెహబూబా’కు ఒక డ్యాన్సర్ బెల్లీ నృత్యం చేస్తుండగా.. సంగీత కళాకారులు బ్యాండ్ వాయిస్తున్నారు. ప్రేక్షకులు ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నారు. ఈ ఉల్లాస వాతవరణం క్షణాల్లోనే విషాదంగా మారింది. అకస్మాత్తుగా సీలింగ్ నుంచి మంటలు మొదలయ్యయి. మొదట సిబ్బంది దీన్ని గమనించినప్పటికీ వెంటనే అప్రమత్తమైనట్లు కనిపించలేదు. కానీ క్షణాల్లో మంటలు పెరగడం.. దట్టమైన పొగ కమ్మేయడం మొదలైంది. దీంతో మ్యూజిక్ ను నిలపేసి ఫైర్ అంటూ అక్కడున్న వారంతా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇరుకు మార్గాలు.. తాటాకు అలంకరణనే ప్రమాద తీవ్రతకు కారణం

ప్రమాదానికి గల కారణాలపై ప్రాథమిక దర్యాప్తు జరుగుతోంది. మొదటి అంతస్థులోని డ్యాన్స్ ఫ్లోర్ లో మంటలు మొదలైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో సుమారు 100 మంది క్లబ్ లో ఉన్నట్లు సమాచారం. చిన్న తలుపులు , ఇరుకు మార్గాలు ఉండడంతో కస్టమర్లు బయటక రాలేకపోయారని తెలిసింది. కొంతమంది గ్రౌండ్ ఫ్లోర్ లోని కిచెన్ లోకి వెళ్లి చిక్కుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించార. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించరు.

క్లబ్ లోపల తాటాకులతో చేసిన అలంకరణలు మంటలు వేగంగ వ్యాపించడానికి కారణంగా మారాయి. అంతేకాకుండా గతంలో ఈ క్లబ్ ను కూల్చివేతకు నోటీసులు కూడా ఇచ్చారనే విషయం ఈ సందర్భంగా వెలుగులోకి వచ్చింది.

ప్రమాదంలో మరణించిన 25 మందిలో నలుగురు పర్యాటకులు, 14 మంది క్లబ్ సిబ్బంది ఉన్నారు. మరో ఏడుగురిని గుర్తించాల్సి ఉంది. మృతుల్లో ఝార్ఖండ్, అస్సాం, తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.

గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. తమ వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు నైట్ క్లబ్ యజమాని ఏర్పాట్లు చేయాలని ఝర్ఖండ్ వాసులు డిమాండ్ చేశారు.

మొత్తంగా ఈ భారీ ప్రమాదం పర్యాటక రంగమైన గోవాను ఉలిక్కి పడేలా చేసింది. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు, నిర్మాణ నిబంధనలపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.



Tags:    

Similar News