ఇప్పుడు పపువా న్యూగినియాలో భూకంపం.. రిక్టర్ స్కేల్ మీద ఎంతంటే?

భూమాతకు కోపం వచ్చినట్లుంది. కొద్ది రోజులుగా వేర్వేరు దేశాల్లో వరుస పెట్టి చోటు చేసుకుంటున్న భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి.;

Update: 2025-04-05 07:49 GMT

భూమాతకు కోపం వచ్చినట్లుంది. కొద్ది రోజులుగా వేర్వేరు దేశాల్లో వరుస పెట్టి చోటు చేసుకుంటున్న భూకంపాలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. మయన్మార్.. థాయ్ లాండ్ లలో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం ఆ రెండు దేశాల్లో ఎలాంటి పరిస్థితులకు కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిక్టర్ స్కేల్ మీద 7.7 గా నమోదైన భూకంపం ధాటికి ఒక్క మయన్మార్ లోనే మూడు వేలకు పైగా ప్రజలు మరణించటం తెలిసిందే. వేలాది మంది గాయాలబారిన పడ్డారు. పెద్ద ఎత్తున గల్లంతు కావటం తెలిసిందే.

తీవ్ర ఆర్థిక నష్టానికి గురి చేసిన ఈ భూకంపం ధాటికి రెండు దేశాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆ తర్వాత జపాన్ లోనూ భూకంపం చోటు చేసుకుంది. అయితే.. మయన్మార్.. థాయిలాండ్ తో పోలిస్తే తీవ్రత తక్కువ కావటం.. పెను భూకంపాలు చోటు చేసుకున్నా.. అందుకు తట్టుకునేలా చర్యలు పక్కాగా ఉండటంతో.. భూకంప తీవ్రత పెద్దగా తెలియలేదు.

ఇదిలా ఉండగా తాజాగా పశ్చిమ న్యూ బ్రిటన్ ప్రావిన్స్ లోని కింబే పట్టణానికి 194 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే చెబుతోంది. పది కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో అమెరికా సునామీ హెచ్చరికల్ని జారీ చేసింది. గత ఏడాది మార్చిలోనూ ఈ దేశంలో భూకంపం చోటు చేసుకుంది. దీని ప్రభావం తాజాగా ఎంతన్న విషయంపై వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. మరోవైపు శుక్రవారం సాయంత్రం నేపాల్ లో భూకంపం చోటు చేసుకోవటం తెలిసిందే. రిక్టర్ స్కేల్ మీద దీని తీవ్రత 5.0గా నమోదైంది. దీని ప్రభావం ఉత్తరాఖండ్.. ఉత్తరప్రదేశ్ లోని పలు చోట్ల చోటు చేసుకున్నాయి.

Tags:    

Similar News