కూటమి మంత్రి సామాన్యుడు కాదు సుమా !
ఇక సత్యకుమార్ యాదవ్ ఏపీకి చెందిన నేత అయినప్పటికీ ఆయన ఏపీ కంటే జాతీయ స్థాయి లోనే ఎక్కువగా పనిచేశారు. ప్రత్యేకించి ఆయనకు కేంద్ర పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షాతో నేరుగానే సంబంధాలు ఉన్నాయి.
ఏపీలో 2024 ఎన్నికల్లో బీజేపీ నుంచి సత్య కుమార్ యాదవ్ అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ సీటు నుంచి చివరి నిముషంలో పోటీకి దిగి గెలిచారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా కూడా అయ్యారు. కీలకమైన వైద్య ఆరోగ్య శాఖలు ఆయనకు దక్కాయి. తనకు అప్పగించిన శాఖల విషయంలో ఆయన ఎంతో సమర్థంగా పనిచేస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కూడా పొందుతూ ముందుకు సాగుతున్నారు. ఇక సత్యకుమార్ యాదవ్ ఏపీకి చెందిన నేత అయినప్పటికీ ఆయన ఏపీ కంటే జాతీయ స్థాయి లోనే ఎక్కువగా పనిచేశారు. ప్రత్యేకించి ఆయనకు కేంద్ర పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షాతో నేరుగానే సంబంధాలు ఉన్నాయి.
ఎంపీగా దిగాల్సింది :
అయితే సత్య కుమార్ యాదవ్ 2024 ఎన్నికల్లో ఎంపీగానే బరిలోకి దిగాల్సింది అన్న ప్రచారం సాగింది. అయితే పొత్తులలో సర్దుబాటు కుదరకపోవడంతో ఆయనను ఎలాగైనా ప్రత్యక్ష ఎన్నికల్లో దించాలని బీజేపీ ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం వల్లనే ధర్మవరం నుంచి ఆయన లాస్ట్ మినిట్ లో అభ్యర్థి అయ్యారు. ఇక ఆయన ఎన్నికల ప్రచారం కోసం ఏకంగా కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చారు అంటేనే ఆయనంటే బీజేపీ పెద్దలకు ఉన్న అభిమానం సాన్నిహిత్యం అర్ధం అవుతాయని అంటారు. ఇక సత్యకుమార్ యాదవ్ కి జాతీయ స్థాయిలో ఎంతో పలుకుబడి కేంద్ర మంత్రులు నాయకులతో మంచి పరిచయాలు ఉన్నా ఏ రోజూ ఆయన తానూగా బయటకు చెప్పుకోలేదు. కానీ ఒక కేంద్ర మంత్రి మాత్రం సత్యకుమార్ గురించి జాతీయ స్థాయిలో ఆయన పలుకుబడి గురించి ఒక్క మాటలో చెప్పేశారు.
మా బడా సాబ్ అంటూ :
ఏపీలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన కేంద్ర వస్త్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడకు వచ్చిన బీజేపీ మంత్రి సత్య కుమార్ యాదవ్ ని చూసి సత్యాజీ అంటూ ఎంతో అప్యాయంగా పలకరించారు. అంతే కాదు ఈయన మాకు బడా సాబ్ అంటూ అందరికీ పరిచయం చేశారు. ఈ సంఘటన విశాఖ విమానాశ్రయం వద్ద జరిగింది. కేంద్ర మంత్రి ఆ విధంగా సత్య కుమార్ యాదవ్ తో తనకున్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకుంటూ ఎంతో ఆప్యాయంగా పలకరించడమే కాదు ఆయన మాకు నాయకుడు అని చెప్పుకుని మురిసిపోవడం అక్కడ చూసిన వారికి అందరికీ ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని కలిగించింది. గతంలో తాము ఇరువురు కలిసి పనిచేసిన సందర్భాలను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఎన్నికల కోసం :
గతంలో యూపీ సహా కీలక రాష్ట్రాలలో ఎన్నికల కోసం సత్య కుమార్ యాదవ్ పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. బీజేపీకి అకుంఠితమైన సేవకుడిగా పార్టీ బాధ్యతలు ఎక్కడ అప్పగిస్తే అక్కడకు వెళ్ళి పనిచేసి విజయాన్ని చేకూర్చిన ఘనత సత్య కుమార్ యాదవ్ కి దక్కుతుంది. యూపీ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్య నాధ్ తో సహా ఎంతో మంది బీజేపీ ముఖ్యమంత్రుల వద్ద కూడా సత్య కుమార్ యాదవ్ కి మంచి పలుకుబడి ఉంది. అయితే ఆయన ఇపుడు ఏపీ మంత్రిగా రాష్ట్రానికే పరిమితం అయి తన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన ఎంపీ అయి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు అన్న ప్రచారం కూడా ఉనిద్. ఇదిలా ఉంటే తన పట్ల ఆప్యాయత చూపించిన కేంద్ర మంత్రికి సత్యకుమార్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు దేశంలో మంజూరైన ఏకైక మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గానికి మంజూరు చేసినందుకు గిరిరాజ్ సింగ్ కి సత్య కుమార్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.