22 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికిన 'కిచెన్' గొడవ!
వివారాళ్లోకి వెళ్తే.. 2022లో అహ్మదాబాద్ లోని ఓ జంటకు వివాహం అయ్యింది. ఈ సమయంలో.. మత విశ్వాసాల కారణంగా భార్య ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకుండా పూర్తిగా దూరంగా ఉండేది.;
'అమెరికాలో అంతేనమ్మా.. తలుపుకి గొళ్లెం పెట్టలేదని, పొయ్యిమీద కాఫీ పెట్టలేదని, కుక్కకు గొలుసు కట్టలేదని.. దేనికైనా విడాకులు ఇచ్చేస్తారు' అనేది ఓ సినిమాలో సరదా డైలాగ్... అంతకంటే తక్కువ కాదు అన్నట్లుగా భారతదేశంలోనూ కిచెన్ లో ఉల్లిపాయ, వెల్లులి అనే రెండు పదార్థాల కారణంగా కూడా విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అవును... భారత్ లాంటి దేశంలో కూడా ఇటీవల విడాకుల కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆ కారణంగా బెంగళూరులోని ఓ టెంపుల్ లో పూజారులు వివాహాలు చేయమని ప్రకటించిన పరిస్థితి! ఈ సమయంలో ఒక జంట ఉల్లిపాయ, వెల్లుల్లి అనే రెండు పదార్థాల విషయంలో నెమ్మదిగా మొదలుపెట్టిన ఘర్షణకు.. చివరికి సంవత్సరాల తర్వాత గుజరాత్ హైకోర్టు చట్టపరమైన ముగింపు ప్రకటించింది.
వివారాళ్లోకి వెళ్తే.. 2022లో అహ్మదాబాద్ లోని ఓ జంటకు వివాహం అయ్యింది. ఈ సమయంలో.. మత విశ్వాసాల కారణంగా భార్య ఉల్లిపాయలు, వెల్లుల్లి తినకుండా పూర్తిగా దూరంగా ఉండేది. అయితే.. ఆమె భర్త, అత్తగారు మాత్రం వారి రెగ్యులర్ ఆహారాన్ని కొనసాగించారు. ఈ తేడా తొందర్లోనే వంటగదిలోకి ప్రవేశించింది.. రెండు రకాల వంటలు వండబడ్డాయి.
ఈ క్రమంలో కాలక్రమేనా ఉల్లి, వెల్లుల్లి వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. ఈ సమయంలో భార్య ప్రార్థనలకు హాజరవ్వడం, తాను నమ్ముకున్న శాఖ నియమాలను పాటించడం స్ట్రిక్ట్ గా కొనసాగించింది. అయితే అందుకు భర్త ఏమాత్రం అంగీకరించలేదు. అంటే.. భర్త మాటకు విలువ ఇద్దామని ఆమె అనుకోలేదు.. భార్య విశ్వాసాన్ని గౌరవించాలని అతడూ అనుకోలేదన్నమాట!
ఈ నేపథ్యంలో 2013లో భర్త ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశాడు. అప్పటికే తన భార్య తమ బిడ్డతో కలిసి బయటకు వెళ్లిపోయిందని కోర్టుకు తెలిపాడు. ఈ నేపథ్యంలో 2024 మె 8న ఫ్యామిలీ కోర్టు వారి వివాహాన్ని రద్దు చేసింది. భరణం చెల్లించాలని ఆదేశించింది! దీంతో ఇరు వర్గాలు గుజరాత్ హైకోర్టుకు వెళ్లాయి. ఈ సందర్భంగా ఆ వ్యక్తి భరణ ఉత్తర్వును ప్రశించారు.
ఆ మహిళ విడాకులను సవాలు చేస్తూ భరణం అమలు చేయాలని కోరిందని తెలుస్తోంది. విచారణ సమయంలో వారి వంట గది రచ్చను ఎవరి వెర్షన్ లో వాళ్లు కోర్టులో వినిపించారు! ఈ సమయంలో ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ సంగీత్ విసేన్, జస్టిస్ నిషా ఠాకూర్ లతో కూడిన ధర్మాసనం విడాకుల అంశాన్ని మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం లేదని పేర్కొంది! కిచెన్ గొడవకు విడాకులతో ముగింపు పలికింది!