వారానికి అయిదు రోజులే బ్యాంకులు !

దేశంలో బ్యాంకింగ్ సెక్టార్ ఎంతలా విస్తరించిందో అందరికీ తెలిసిందే. పట్నాలు పల్లెలు అంతరం లేకుండా బ్యాంకుల శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

Update: 2026-08-25 01:30 GMT

దేశంలో బ్యాంకింగ్ సెక్టార్ ఎంతలా విస్తరించిందో అందరికీ తెలిసిందే. పట్నాలు పల్లెలు అంతరం లేకుండా బ్యాంకుల శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ రోజుకు దేశంలో బ్యాంకుల శాఖలు ఎన్ని ఉన్నాయంటే దాదాపు 1.6 నుండి 1.7 లక్షలకు పైగా బ్యాంక్ శాఖలు ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ప్రైవేట్ గ్రామీణ విదేశీ బ్యాంకుల నెట్‌వర్క్ కలిపి సుమారు 1,60,000 నుండి 1,70,000 వరకు శాఖలు పనిచేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అత్యధిక శాఖలు కలిగిన అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉంది. ఒక్క ఎస్‌బీఐ కే దేశవ్యాప్తంగా సుమారు 23,085 కి పైగా శాఖలను కలిగి ఉన్నాయి.ఇతర బ్యాంకులు చూస్తే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు కూడా వేల సంఖ్యలో శాఖలను కలిగి ఉన్నాయి. వీటి ద్వారా దైనందిన ఆర్థిక లావాదేవీలు మొత్తం సాగుతున్నాయి.

వారానికి ఐదు రోజులే :

ఇదిలా ఉంటే దేశంలోని బ్యాంకుల పని దినాలను వారానికి అయిదు రోజులకు పరిమితం చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ఈ ప్రతిపాదనపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కి చర్చలు జరిగినప్పటికీ ఫలితం రావడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ తుది ఆమోదం ఇంకా వెలువడవలసి ఉంది అని అంటున్నారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్లు పెట్టిన ఈ ప్రతిపాదన ప్రకారం చూస్తే : అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించి సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకులను నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దానికి గానూ ప్రతీ రోజూ అదనంగా నలభై నిముషాలు పనిచేస్తామని చెబుతున్నాయి. ఈ డిమాండ్‌పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కేంద్ర ఆర్థిక శాఖ సానుకూలంగా ఉన్నా అమలు తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.

ఆందోళనలకు పిలుపు :

ఐదు రోజుల బ్యాంకింగ్ అమలులో జరుగుతున్న జాప్యంపై బ్యాంకింగ్ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు సమ్మెల హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇక్కడ బ్యాంక్ అసోసియేషన్ల ప్రతినిధులు చెబుతున్నది ఏంటి అంటే డిజిటల్ సేవలు ప్రస్తుతం అన్ని చోట్లా అందుబాటులో ఉన్నాయి కదా అని అందువల్ల బ్యాంకుల శాఖలు పనిచేయకపోయినా ఏటీఎం నెట్ బ్యాంకింగ్ యూపీఐ సేవలు యథావిధిగా 24/7 అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. అందువల్ల అయిదు రోజుల పని దినాలను బ్యాంకులలో అమలు చేసినా ఎలాంటి ఇబ్బందులు అయితే రావని అంటున్నారు.

బ్యాంకులే కీలకం :

అయితే ఎంతలా డిజిటల్ లావాదేవీలు పెరిగినా బ్యాంకులదే కీలక పాత్ర ఈ రోజుకీ ఉందని అంటున్నారు. డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరగడంతో బ్యాంకు శాఖలకు వెళ్లే వారి సంఖ్య తగ్గినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకుల ప్రాముఖ్యత పాత్ర ఏ మాత్రం తగ్గలేదని బ్యాంకింగ్ రంగం నిపుణులు అంటున్నారు. బ్యాంకుల పాత్ర ఎందుకు తగ్గలేదు అంటే అకౌంట్లు ఆధారం కాబట్టి. యూపీఐ డిజిటల్ పేమెంట్స్ ఏవి చేయాలన్నా వెనుక బ్యాంకు ఖాతా ఉండటం తప్పనిసరిగా ఉంటుంది. యూపీఐకి 10 ఏళ్లు పూర్తయ్యే నాటికి కూడా సేవలు అందించే బ్యాంకుల సంఖ్య ప్రారంభంలో 44 ఉంటే ఇప్పుడు 703 పెరిగింది అని గుర్తు చేస్తున్నారు. సైబర్ మోసాలను అరికట్టడంలో బ్యాంకులు ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. అలాగే రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులదే ప్రధాన బాధ్యతగా ఉంది. ఈ క్రమంలో .పెద్దఎత్తున డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నా వాటి నిర్వహణకు బ్యాంకులు వెన్నెముకగా నిలుస్తున్నాయి. దాంతోనే బ్యాంకులు పని దినాలు వారానికి అయిదు అంటే కొంత ఆలోచించాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News