అసలే శీతాకాలం... కొత్తరకం వైరస్ ను గుర్తించిన వైద్యులు!
అవును... అమెరికాలోని వాషింగ్టన్ లో కొత్తరకం వైరస్ కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలోని ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడంతో ఆస్పత్రిలో చేరారు.;
సాధారణంగా వైరస్ లు శీతాకాలంలో ఎక్కువగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తాయని చెబుతారు. ప్రధానంగా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అంటారు. ఈ క్రమంలో ఇలా శీతాకాలం రాగానే అటు ఓ వ్యక్తికి సరికొత్త వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇలాంటి వైరస్ మనుషులకు సోకడం ఇదే తొలిసారని చెబుతున్నారు. అమెరికాలో దీన్ని గుర్తించారు!
అవును... అమెరికాలోని వాషింగ్టన్ లో కొత్తరకం వైరస్ కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలోని ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకడంతో ఆస్పత్రిలో చేరారు. ఈ సమయంలో అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. "హెచ్5 ఎన్5 ఏవియన్ ఇన్ ఫ్లూయింజా" అనే కొత్తరకం వైరస్ సోకినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా వైద్యులు పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... సాధారణంగా ఇన్ ఫ్లూయింజా వైరస్ జంతువులలోనే వ్యాపిస్తుందని.. ఈ వైరస్ సోకిన జంతువుల మల పదార్థాలు, లాలాజలం లేదా పాడి పశువుల పాల ద్వారా వేరే ప్రాణులకు సోకే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వ్యాప్తి శీతాకాలంలో మరింత అధికంగా ఉంటుందని తెలిపారు. దీంతో.. వైరస్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్నవారి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన అమెరికా వైద్యశాఖ.. తమ దేశంలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసు రావడం గడిచిన తొమ్మిది నెలల్లో ఇదే తొలిసారని ప్రకటించింది. ఈ వైరస్ మనుషులలో అంత ప్రభావం చూపే అవకాశాలు లేవని వెల్లడించింది. ఇదే సమయంలో.. దీనిని తేలికగా తీసుకోవద్దని.. ప్రధానంగా కోళ్ల పరిశ్రమల్లో పని చేసే కార్మీకులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.
ఈ సమయంలో.. ఈ వ్యక్తికి ఈ వ్యాధి ఎలా సోకిందో తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని.. వ్యాధి నియంత్రణ, నివారణ కేమ్రాలు ఈ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని.. అయితే, ఈ కేసు వల్ల ప్రజారోగ్యానికి ప్రమాదం పెరిగిందని సూచించడానికి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వెల్లడించింది.