విజయ్ పై ఫత్వా... ముస్లిం బోర్డు నిర్ణయం వెనుక కీలక కారణం!

ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం బోర్డు నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ నాయకుడు విజయ్ పై ఫత్వా జారీ చేసింది.;

Update: 2025-04-17 09:48 GMT

తమిళ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు, దళపతి విజయ్ కు ముస్లిం బోర్డు షాకిచ్చింది! ఇందులో భాగంగా... ఉత్తరప్రదేశ్ బరేలిలోని సున్నీ ముస్లిం బోర్డు ఫత్వా జారీ చేసింది. ఈ మేరకు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మీ దారుల్ ఇఫ్తా చీఫ్ మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేలీ.. విజయ పై ఈ ఫత్వా జారీ చేశారు.

అవును... ఉత్తరప్రదేశ్ లోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం బోర్డు నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ నాయకుడు విజయ్ పై ఫత్వా జారీ చేసింది. దీంతో... విజయ్ వివాదంలో చిక్కుకున్నట్లయ్యింది. ఈ సందర్భంగా.. ముస్లిం సెంటిమెంట్ ను విజయ్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాడని మౌలానా రజ్వీ ఆరోపించారు.

ఫత్వా ప్రకారం... ఇస్లాం వ్యతిరేక రీతిలో విజయ్ ప్రవర్తించాడని.. అతని గత చర్యలు ముస్లిం సమాజం పట్ల శత్రుత్వాన్ని ప్రదర్శించాయని ఆరోపించారు. మద్యం సేవించే, జూదం ఆడే వ్యక్తులను ఇఫ్తార్ సమావేశానికి ఆహ్వానించడం పాపమని చెబుతూ.. ఇలాంటి వ్యక్తులను మతపరమైన కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలను కోరింది.

ఈ సందర్భంగా "బీస్ట్" సినిమాను ప్రస్థావించిన రజ్వీ... ఆ సినిమాలో ముస్లింలను, వారి సమాజాన్ని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా చిత్రీకరించారని.. వారిని విలన్లుగా చూపించారని.. ఈ విధంగా తన సినిమాల్లో వారి ఇమేజ్ ను దెబ్బతీసిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ముస్లిం ఓట్లను గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే... ఇస్లామిక్ ఆచారాలను గౌరవించని, ఉపవాసం ఉండని వక్తులను ఇఫ్తార్ కార్యక్రమానికి ఆహ్వానించడం అంటే.. అది పవిత్ర రంజాన్ మాస పవిత్రతను అగౌరవపరచడమేనని రజ్వీ అన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సమాజం నిర్వహించే మతపరమైన కార్యక్రమాలకు విజయ్ ను ఆహ్వానించవద్దని ఆయన అభ్యర్థించారు.

Tags:    

Similar News