• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Business >  జుక్ నువ్వో చికెన్.....

జుక్ నువ్వో చికెన్.. మస్క్.. నువ్వు పిరికి.. కేజ్ కంటే ఆన్ లైన్ లోనే గట్టి కొట్లాట

| తాను జుకర్ బర్గ్ తో ఇటలీలో కేజ్ ఫైట్ లో పాల్గొంటానని కొన్నాళ్ల క్రితం మస్క్‌ స్వయంగా వెల్లడించారు

By - Tupaki Desk
Update: 2023-08-14 07:11 GMT

ఒకరు అత్యంత అధునాతన సాంకేతిక యంత్రాలు, ఆలోచనలకు పెట్టింది పేరు.. మరొకరు అత్యంత జనాదరణ పొందిన సోషల్ మీడియా దిగ్గజానికి పెద్దన్న.. ఇద్దరి మధ్య ఓ పోరాటం ఆసక్తి రేపుతోంది. దీనికి ముందే మాటల యుద్ధం జరుగుతోంది.

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌.. అభినవ విశ్వామిత్రుడనే చెప్పాలి. ఊహకు అందని ఫీచర్లతో టెస్లా అనే కారును తీసుకొచ్చి.. ఔరా అనిపించారు. స్పేస్ ఎక్స్ అనే శాటిలైట్ సంస్థను స్థాపించి అంతరిక్ష యాత్రను కూడా సాధారణ యాత్రగా మార్చారు. ఇక ఫేస్ బుక్.. ఇప్పుడంటే ఇతర సోషల్ మీడియా వచ్చింది గానీ.. పదేళ్ల కిందటి వరకు ఫేస్ బుక్ దే రాజ్యం. అయితే, ఆశ్చర్యకరం ఏమంటే సోషల్ మీడియా ఎంత పెరిగిపోయినా.. ఫేస్ బుక్ స్థానం పదిలంగానే ఉంది. ఇంతలో మస్క్ ట్విటర్ ను కొనడం.. దాని పేరును ఎక్స్ గా మార్చడం.. దానికి పోటీనా అన్నట్లు జుకర్ బర్గ్ సంస్థ థ్రెడ్స్ ను తీసుకురావడంతో ఇద్దరి మధ్య సమరం రంజుగా ఉంది. మస్క్, జుకర్ బర్గ్ మధ్య ఇటీవలి కాలంలో ఓ అంశం మరింత చర్చనీయాంశమైంది. అదే ''కేజ్ ఫైట్''.

సమయం చెప్పు మిత్రమా..?

''మస్క్ తో కేజ్ ఫైట్ కు నేను సిద్ధం. కానీ ఆయనే సమయం ఇవ్వడం లేదు'' అంటూ జుకర్ బుర్గ్.. తన థ్రెడ్స్ లో మెసేజ్ పెట్టారు. అసలే ఎక్స్ కు పోటీ అయిన థ్రెడ్ లోని ఈ మెసేజ్ కు మస్క్ అంతే వేగంగా స్పందించారు. ''నీ ఇంటి తలుపు తట్టేందుకు రేపటి దాక నేను ఆగలేను మిత్రమా'' అంటూ దీటుగా సమాధానమిస్తూ పోస్ట్ చేశారు.

మస్క్ నాన్ సీరియస్..?

తాను జుకర్ బర్గ్ తో ఇటలీలో కేజ్ ఫైట్ లో పాల్గొంటానని కొన్నాళ్ల క్రితం మస్క్‌ స్వయంగా వెల్లడించారు. అంతేకాదు.. దీనికి వేదిక, విషయం గురించి ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతోనూ చర్చించినట్లు వివరించారు. తాను, జుకర్‌ బర్గ్‌ ఫౌండేషన్లు నిర్వహించే ఈ ఫైట్ ఎక్స్‌ , మెటాలో లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుందని మస్క్‌ తెలిపారు. కానీ, నిర్దిష్ట తేదీ చెప్పలేదు. వాస్తవానికి ఆగస్టు 26న ఫైట్ కు సిద్ధమని జుకర్‌ బర్గ్‌ ప్రకటించారు. దీనికి ఆయన నుంచి స్పష్టత రాలేదు. తేదీ దగ్గర పడుతుండడంతోనే మస్క్ ఆలస్యం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తూ జుకర్ బర్గ్ థ్రెడ్స్ లో పోస్ట్ పెట్టారు. తనతో కేజ్‌ ఫైట్‌ ను మస్క్ తేలిగ్గా తీసుకున్నారని.. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తానని చెప్పారు.

డేట్ చెప్పడు.. సర్జరీ అంటాడు..

జుకర్ బర్గ్ కేజ్ ఫైట్ కు తేదీ చెప్పి చాలా రోజులైంది. కానీ, మస్క్ స్పందించడం లేదు. ఈ విషయాన్ని జుకర్ బర్గ్ ప్రస్తావిస్తూ.. 'నేను తేదీ చెప్పినప్పటికీ మస్క్ స్పందించడం లేదు. సర్జరీ చేయించుకోవాల్సి ఉందని ఓసారి అన్నాడు. ఇప్పుడేమో తన ఇంటి పెరట్లో ''ప్రాక్టీస్ రౌండ్‌'' ఆడదామంటున్నాడు. అతడు సీరియస్‌ గా లేడేమో..? సిద్ధమై ఉంటే నన్ను ఎలా సంప్రదిండం మస్క్ కు తెలుసు. కాదని చెబితే. నేను ముందుకెళ్తా. ఇంకొకరితో పోటీకి సిద్ధమవుతా'' అని జుకర్‌ బర్గ్‌ వెల్లడించారు.

రేపే సిలికాన్ వ్యాలీ వెళ్తా.. మస్క్

మస్క్ ను రెచ్చగొట్టేలా థ్రెడ్స్ లో జుకర్ బర్గ్ చేసిన పోస్టును ఓ నెటిజన్ ఆయన దృష్టికి తీసుకెళ్లాడు. ఇంకేం..? దీనికి ఉడికిపోతూ.. ''నేను సోమవారమే సిలికాన్ వ్యాలీకి వెళ్తున్నా. జుకర్ బర్గ్ ఇంటి తలుపు తట్టేందుకు ఇంకా సమయం వేస్ట్ చేయను'' అని స్పందించారు. జుకర్ బర్గ్ ను పందెం కోడితో పోలుస్తూ.. 'జుక్ ఈజ్ ఏ చికెన్‌ ' అని ఎగతాళి చేశారు. కాగా, అమెరికాలోని ప్రముఖ రెస్టారెంట్‌ పేరు ''చిక్‌ ఫిల్‌''. ఈ రెస్టారెంట్ కు వెళ్లి జుకెర్ బర్గ్ చికెన్ తినలేడనే అర్థంలో మస్క్ హాస్యమాడారు. దీనికి కారణం ఏమంటే.. ''జుక్ ఈజ్ ఏ చికెన్. అతడి జాతిని అతడే తిన్నట్లవుతుంది. అందుకే చిక్ ఫిల్ కు వెళ్లడు'' అనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానించాడు.

Tags:    
  • Elonmusk 
  • Markzuckerberg 
  • Twitterowner 
  • Tesla 
  • Facebook 
  • MuskMarkzuckerberg 
  • Siliconvalley 
  • Socialmedia 
  • Spacex 
  • Zuckerberg 

Similar News

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

రోజుకు లక్ష కోట్లు.. భారత యూపీఐ పవర్ ఇదీ

2026-11-01 15:05 GMT

సినిమాలకు దూరంగా ఉన్నా.. భారీగా సంపాదిస్తున్న సమంత!

2026-10-22 12:30 GMT

వామ్మో ఇదేం తాగుడు? రోజులో రూ.303 కోట్ల లిక్కర్ సేల్

2026-10-22 08:00 GMT

3300 కోట్ల సంప‌ద సృష్టి వెన‌క సీక్రెట్.. ఈ న‌టుడు ఒక బ్యాడ్ బిజినెస్‌మేన్!

2026-10-16 09:30 GMT

UKలో బిజినెస్: క‌త్రిన కంటే ముందే స‌క్సెసైన టాప్-3 హీరోయిన్‌లు!

2026-10-13 03:38 GMT

ఇండియా బెస్ట్ స్టార్లు సినిమాల‌తో ప‌ని లేకుండా సంపాదనాప‌రులు!

2026-10-08 03:48 GMT

ప్రకటనలు కాదు.. ప్రజల పార్టిసిపేషన్‌తో పబ్లిసిటీ.. కంపెనీ మాస్టర్ ప్లాన్!

2026-10-07 06:16 GMT

$110 బిలియన్ల భారీ డీల్: స్కైడాన్స్ గా మారిన‌ పారామౌంట్ - వార్నర్ బ్రోస్ ఉమ్మడి సంస్థ!

2026-10-03 10:29 GMT

ఒక రాత్రికి రూ. 71,000 .. ఆతిథ్య రంగంలో రెహానేకు క‌ళ్లు చెదిరే ఆదాయం

2026-10-01 19:30 GMT

తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ ఫ్యామిలీలు ఇవే.. టాప్‌లో ఎవరున్నారంటే?

2026-08-12 08:33 GMT

Copyright @2026

Powered by Blink CMS