వేగంగా తిరుగుతున్న భూమి.. అదే జరిగితే అనర్థం తప్పదు అంటున్న శాస్త్రవేత్తలు!

ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం వంటి వాటి వల్ల ఓజోన్ పొర దెబ్బతినడం, వాతావరణంలో భయంకరమైన మార్పులు రావడం, సునామీలు, భూకంపాలు మనం చూస్తూనే ఉన్నాం.;

Update: 2025-08-05 13:20 GMT

మానవ కార్యకలాపాల వల్ల వాతావరణంలో ఎన్నో మార్పులు సంభవిస్తున్నాయి. ఇప్పటికే ప్లాస్టిక్ వాడకం వంటి వాటి వల్ల ఓజోన్ పొర దెబ్బతినడం, వాతావరణంలో భయంకరమైన మార్పులు రావడం, సునామీలు, భూకంపాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా మరో విషయం అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇది చూస్తూ ఉంటే ఏదో ఊహించనిది జరగబోతోందని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. భూమి చాలా వేగంగా తిరుగుతోందట. అయితే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది.అలా ఈ 24 గంటల సమయాన్ని ఒక రోజుగా లెక్కిస్తారు.

అయితే ప్రస్తుతం భూమి ఇప్పుడు ఉన్న వేగం కంటే మరింత వేగంగా తిరుగుతోందని తెలియజేస్తున్నారు. అంతేకాదు భూమి ఇలా ఫాస్ట్ గా తిరగడం వల్ల ఒక రోజులో కొంత వ్యవధి తగ్గుతోందని అంటున్నారు. మరి భూమి ఇలా వేగంగా తిరిగితే మానవాళికి ఏదైనా ముప్పు ఉందా ? శాస్త్రవేత్తలు ఎందుకు ఆందోళన పడుతున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం. శాస్త్రవేత్తలు ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉంటారు. అందులో భాగంగా తాజాగా భూమిపై చేసిన ఓ పరిశోధనలో షాకింగ్ విషయం తేలింది. అదేంటంటే భూమి వేగంగా తిరగడం వల్ల రోజులో కొంత టైమ్ కోతకు గురవుతుందని తెలియజేశారు. అయితే దీనివల్ల రోజుల సమయం తగ్గుతోందని చెబుతున్నారు.అంటే ఒక రోజులో 1.3 నుండి 1.5 మిల్లీసెకండ్లు తగ్గుతుందట.అయితే ఈ తక్కువ సమయం మన రోజువారి పనులకు ఎలాంటి ఆటంకం కలిగించకపోయినప్పటికీ సైంటిస్టులు మాత్రం ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

ఎందుకంటే ఇది ఇలాగే కొనసాగితే ముందు ముందు అనర్ధాలు తప్పవని అంటున్నారు. అయితే ఇంతకుముందు జూలై నెలలో 9, 22 ఈ రెండు రోజుల్లో కొన్ని మిల్లీ సెకండ్లు తగ్గాయి. ఇక తాజాగా ఈరోజు అనగా ఆగస్టు 5న కూడా మరొకసారి రోజులో 1:25 మిల్లీ సెకండ్లు తగ్గాయి. అయితే భూమి ఇంత ఫాస్ట్ గా తిరిగితే అటామిక్ క్లాక్, సోలార్ టైం మధ్య తేడా ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భూమి వేగంగా తిరగడం గురించి అంతర్జాతీయంగా ఒక చర్చ నడుస్తోంది. 2035 నాటికి నెగిటివ్ లీప్ సెకండ్ ని తీసివేయాలని చర్చించుకుంటున్నారట. కానీ ఇలా తీసివేస్తే కొత్త సమస్యలు తలెత్తుతాయని సైంటిస్టులు అంటున్నారు. గతంలో అంటే 1972 సంవత్సరంలో 27 పాజిటివ్ లీప్ సెకండ్ లను యాడ్ చేశారు. దానివల్ల అప్పట్లో ఎన్నో ఇబ్బందులు తలెత్తాయి.

భూమి వేగం పెంచడానికి కారణం ఏంటంటే..చంద్రుడు భూమధ్యరేఖకు దూరంగా ఉన్నప్పుడు చంద్రుడి గురుత్వాకర్షణ ప్రభావం భూమిపై తక్కువగా ఉంటుంది.దీనివల్ల భూమి ఫాస్ట్ గా తిరుగుతుంది అని తెలుస్తోంది. అలా ఇప్పటికే జూలై 9,22వ తేదీలలో కూడా ఇలాగే జరిగింది. తాజాగా ఆగస్టు 5న కూడా జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున 1.66 సెకండ్ల సమయం తగ్గనుంది అని సమాచారం.

Tags:    

Similar News