డాక్టర్ చిట్టీ చూపిస్తేనే దగ్గుమందు.. తాజా రూల్.. ఎందుకంటే?
పలు రకాల దగ్గుమందు సిరప్ ల నాణ్యత.. రోగుల ఆరోగ్య భద్రతపై ఆందోళనలు వ్యకతమవుతున్న వేళ.. కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేకుంటే దగ్గు మందును అమ్మకూడదని స్పష్టం చేసింది
అవును.. దగ్గు మందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పలు రకాల దగ్గుమందు సిరప్ ల నాణ్యత.. రోగుల ఆరోగ్య భద్రతపై ఆందోళనలు వ్యకతమవుతున్న వేళ.. కేంద్రంలోని మోడీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇక నుంచి డాక్టర్ ప్రిస్క్రప్షన్ లేకుంటే దగ్గు మందును అమ్మకూడదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి కఠిన నిబంధనల్ని తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా డ్రగ్స్ రూల్స్ 1945లో కొన్ని కీలక సవరణలు చేయటం గమనార్హం. లైసెన్సు కలిగిన మందుల షాపుల్లోనే దగ్గు మందును అమ్మకాలని స్పష్టం చేస్తూ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టమైన నోటిఫికేషన్ ను జారీ చేసింది. మందుల చీటి లేకుండా కొనుగోలు చేసిన దగ్గు మందుల కారణంగా చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు ఎక్కువ అవుతున్న వేళ.. కేంద్రం ఈ తాజా నిర్ణయాన్ని తీసుకుంది.
గతంలో వెయ్యి మంది కంటే జనాభా తక్కువ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వైద్యుడి చిట్టి లేకుండానే దగ్గుమందు సిరప్ ను కొనుగోలు చేయొచ్చు. అలానే వాటిని ఏ షాపులో అయినా అమ్మే సౌలభ్యం ఉండేది. అందుకు భిన్నంగా తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దగ్గు మందును వైద్యుడి చిట్టీ ఉంటేనే ఇస్తారు. గతంలో చట్టంలో ఉన్న వెసులుబాటును తాజాగా తీసేశారు.
తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు దగ్గు మందును ఫార్మా లైసెన్స్ ఉన్న మందుల దుకాణంలో మాత్రమే అమ్మాల్సి ఉంటుంది. అలానే వైద్యుడి ప్రిస్కిప్షన్ కూడా తప్పనిసరి చేశారు. ఈ మేరకు సవరణ అధికారిక గెజెట్ లో డ్రగ్స్ రూల్స్ 2026లో వెల్లడించారు. సిరప్ రూపంలో ఉండే మందులపై నియంత్రణ పర్యవేక్షణనను మరింత కఠినం చేసేందుకు.. ప్రజారోగ్య. .భద్రతా అవసరాలకు అనుగుణంగా తాజా సవరణ చేసినట్లుగా అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.