ట్రంప్ కి ఘోర అవమానం.. టారిఫ్స్ ఎఫెక్ట్!

అయితే తాజాగా ట్రంప్ తీసుకున్నటువంటి 50% సుంకాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో వినూత్నంగా నిరసన తెలియజేశారు.;

Update: 2025-08-23 16:30 GMT

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతదేశంతో స్నేహబంధం ఉంటుందని చెబుతూనే.. వెనుక నుంచి భారతదేశానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ నిర్ణయాలు కేవలం ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాలలో చాలామందిని ఇబ్బంది పెట్టేలా ఉన్నాయి. అయితే ట్రంప్ మాట వింటే ఓకే.. ఒకవేళ ఆయన మాట వినకుంటే ఆ దేశం పై ఏదో ఒక విధంగా కక్ష్య తీర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అన్ని దేశాలపై తనదే పెత్తనం నడవాలి అనుకునే ట్రంప్ వైఖరి ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రజలందరికీ అర్థమవుతోంది. అలాంటి ట్రంప్ భారత్ పై విధించినటువంటి 50 శాతం సుంకాలకు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా చాలా మంది రోడ్లపైకి వచ్చి ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు.

అయితే తాజాగా ట్రంప్ తీసుకున్నటువంటి 50% సుంకాలకు వ్యతిరేకంగా మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో వినూత్నంగా నిరసన తెలియజేశారు. మహారాష్ట్ర ప్రజల సాంప్రదాయ పండుగ అయినటువంటి "మర్బత్ పండగ" సందర్భంగా అక్కడ ఉండే దుష్టశక్తులతో పాటు ట్రంప్ భారీ దిష్టి బొమ్మను ఊరేగించారు. ఇది చూసిన నెటిజెన్స్ ట్రంప్ కి దూరం అవమానం అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ట్రంప్ చమురే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులపై కూడా టారిఫ్ ల మోత మోగిస్తూ అందర్నీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భారత్ నుంచి దిగుమతి చేసుకునే వాటిపై మొత్తంగా 50% సుంకాలను విధిస్తామని ప్రకటించారు. ఇప్పటికే 25% సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో 25% విధిస్తామని చెప్పారు.

ఇప్పటికే సుంకాల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం కూడా చేశారు. అయితే ఆయన ఇలా చేయడానికి ప్రధాన కారణం రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకేనని తెలుస్తోంది. ఈ నిర్ణయం పై అమెరికాలో సొంత పార్టీ నేతలే ట్రంప్ పై వ్యతిరేకత చూపిస్తున్నారు. అయినా ట్రంప్ మాత్రం భారత్ పై కక్ష్య సాధిస్తూనే ఉన్నారు. ఆయన బెదిరింపులకు భయపడేది లేదని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ అన్నారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే మా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని కూడా ఆయన తెలియజేశారు. భారత్ తో సమస్య ఉంటే మా ఉత్పత్తులు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా ఖరాఖండిగా చెప్పేశారు.

రైతులు, పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలను రక్షించడమే మా ప్రభుత్వ ఉద్దేశమని తెలియజేశారు. భారత్ తో సమస్య ఉంటే తమ చమురునో,శుద్ధిచేసిన ఇతర ఉత్పత్తులనో కొనుగోలు చేయవద్దని డైరెక్ట్ గా చెప్పేశారు. రష్యాతో వాణిజ్య సంబంధాలు పెంచుకోవాలని అనుకుంటున్నామని జై శంకర్ పేర్కొన్నారు. ఈ విధంగా ట్రంప్ విధించిన సుంకాలకు భయపడేది లేదని క్లారిటీ ఇచ్చారు.

Tags:    

Similar News