వైసీపీ సీనియర్ ధర్మపన్నాలతో సరి ?

ఉత్తరాంధ్ర వైసీపీలో ఆయన అత్యంత సీనియర్ నాయకుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది.;

Update: 2026-04-23 03:45 GMT

ఉత్తరాంధ్ర వైసీపీలో ఆయన అత్యంత సీనియర్ నాయకుడు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి కూడా అయ్యారు. ఆ తరువాత అనేక సార్లు మంత్రి అయి కీలక శాఖలను చూశారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన రికార్డు ప్రస్తుతానికి అయితే ఆయన పేరు మీద ఉంది. ఆయనే వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు.

సబ్జెక్ట్ లో పులి :

ప్రసాదరావు మాట్లాడారు అంటే కచ్చితంగా అందులో మ్యాటర్ ఉంటుంది అని అంతా అంగీకరిస్తారు. ఆయనను సబ్జెక్ట్ లో పులి అని కూడా అంటారు. ఏ ఇష్యూ మీద అయినా లోతుగా అధ్యయనం చేసి మీడియా ముందుకు వస్తారు. అదే అసెంబ్లీ అయితే అక్కడ కూడా ఆయన ధాటీగా తన వాణిని వినిపిస్తారు. తాజాగా ఆయన కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని అన్నారు. దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఎక్కడా లేని విధంగా ఏపీలో రాజకీయం ఉందని రెడ్ బుక్ రాజ్యం నడుస్తోంది అని ఆగ్రహించారు. ఆ మీదట ధర్మబద్ధమైన పాలన ఎలా ఉంటుందో చెప్పాలి. మొత్తానికి ధర్మాన వారు ధర్మ పన్నాలు అన్నీ వల్లించారు అని అంటున్నారు.

మాస్ లీడర్ గా ఉంటూ :

ఇక చూస్తే శ్రీకాకుళం జిల్లాలో అణువణువూ ప్రసాదరావుకు తెలుసు. ఆయన జిల్లాను గతంలో శాసించారు. ఈ రోజుకీ ఆయనకు ఆ అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ఆయన మాత్రం అపుడపుడు మీడియా ముందుకు వచ్చి సబ్జెక్ట్ ని గుర్తు చేస్తూ క్లాసిక్ టచ్ ఇస్తూ చేసే ప్రసంగాలు విమర్శల వల్ల పెద్దగా ఉపయోగం ఉంటుందా అన్నది పార్టీలో చర్చ సాగుతోంది. వైసీపీకి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి గొంతుకలు కావాలని అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రాలో కూడా సీనియర్ నేతలు పార్టీకి పరుగులు పెట్టించాల్సి ఉందని అంటున్నారు. అయితే ధర్మాన మాత్రం ఎందుకో గ్రౌండ్ లోకి పూర్తి స్థాయిలో దిగడం లేదని అంటున్నారు.

బాధ్యతలు అందుకుంటారా :

ఆయన సేవలను రాష్ట్ర స్థాయిలో కూడా వాడుకోవాలని పార్టీ భావించింది అని ఒక దశలో చర్చ సాగింది. అయితే ధర్మాన ప్రసాదరావు ఆ దిశగా అడుగులు వేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక జిల్లా రాజకీయాల్లోనే ఆయన ఒకింత వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారో లేదో కూడా తెలియదని కూడా అంటున్నారు. ఇక ఆయన కుమారుడు పోటీకి దిగుతారా అలా అయితే ఇప్పటి నుంచే జనంలో బలంగా ఉండాలి కదా అన్నది కూడా పార్టీలో చర్చ సాగుతోఅంది. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే టీడీపీ గట్టిగా ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే కంచుకోటగా ఆ పార్టీకి జిల్లా ఉంది. అలాంటి చోట మాస్ లీడర్ గా ఉన్న ధర్మాన తన వ్యూహాలకు పదును పెట్టి పార్టీకి గేరు మార్చాల్సి ఉందని అంటున్నారు. మరి పెద్దాయన గానే ధర్మాన ప్రసాదరావు ఉంటూ కూటమి ప్రభుత్వానికి చేసే సూచనలు నీతి వాక్యాలతోనే గడిపేస్తారా అన్నది కూడా డిస్కషన్ సాగుతోంది. చూడాలి మరి శ్రీకాకుళం జిల్లా వైసీపీని ముందుకు తీసుకుని వెళ్ళేది ఎవరో.

Tags:    

Similar News