దేవినేని అవినాష్ సంచలన నిర్ణయం ?

వైసీపీలో కీలక నాయకుడు, యువ నేత క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో దూకుడు రాజకీయం చేసే లీడర్ గా ఉన్న దేవినేని అవినాష్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.;

Update: 2025-09-29 03:56 GMT

వైసీపీలో కీలక నాయకుడు, యువ నేత క్రిష్ణా జిల్లా రాజకీయాల్లో దూకుడు రాజకీయం చేసే లీడర్ గా ఉన్న దేవినేని అవినాష్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆయన వైసీపీకి సంబంధించి ఎన్టీఆర్ జిల్లాకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు పార్టీ ఆయనను ఈ జిల్లాకు బలమైన నేతగా భావిస్తోంది. సామాజిక వర్గం పరంగా కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తోంది. కూటమి అన్ని విధాలుగా బలంగా ఉన్న జిల్లాలో దేవినేని అవినాష్ ఒంటి చేత్తోనే పార్టీని లాక్కువస్తున్నారు. ఒక విధంగా కష్టమైన కసరత్తుగా ఉన్నా ఆయన విపక్షంలో ఉన్న పార్టీకి భుజానికి ఎత్తుకుంటున్నారు.

ఎంపీ అభ్యర్ధిగా :

ఇక దేవినేని అవినాష్ కి ఎన్టీఆర్ జిల్లా పగ్గాలు ఇవ్వడం వెనక వైసీపీ హై కమాండ్ ఆలోచనలు కొన్ని ఉన్నాయని అంటున్నారు. ఆయనను వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించాలని పార్టీ చూస్తోంది అని అంటున్నారు. విజయవాడ పార్లమెంట్ సీటు వైసీపీకి ఎపుడూ చిక్కడం లేదు, ఈ సీటులో మూడు సార్లు ఓడి ఆ పార్టీ హ్యాట్రిక్ కొట్టింది. సామాజిక సమీకరణ పరంగా కమ్మ వారికే టికెట్ ఇస్తున్నా ఇక్కడ టీడీపీ బలంగా ఉండడంతో వైసీపీ ఆశలు నెరవేరడం లేదు అని అంటున్నారు. దాంతో 2029ని టార్గెట్ గా వైసీపీ చేసుకుంది. దేవినేని అవినాష్ ని ముందు పెడితే ఈసారి అయినా విజయం దక్కుతుంది అని లెక్క వేసుకుంటోంది అని అంటున్నారు.

నో చెబుతున్న దేవినేని :

అయితే ఈ విషయంలో దేవినేని నో చెబుతున్నారు అని అంటున్నారు. ఆయన ఎంపీగా పోటీకి ఏ మాత్రం సుముఖంగా లేరని అంటున్నారు. పైగా మూడు సార్లు పార్టీ ఓడిన నేపధ్యం ఉంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఆయన తండ్రి దేవినేని నెహ్రూ కూడా ఏనాడూ పార్లమెంట్ కి పోటీ చేయలేదు. ఆయన ఎమ్మెల్యేగానే పోటీ చేసి మంత్రిగా కూడా పనిచేశారు. అవినాష్ అదే ఆలోచనలోఉన్నారని అంటున్నారు. ఈ విషయంలో ఆయన ఇప్పటికే హైకమాండ్ కి తన మనసులో మాటను తెలియచేశారు అని అంటున్నారు.

పెనమలూరు మీద ఫోకస్ :

దేవినేని అవినాష్ విజయవాడ తూర్పులో 2024లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. అంతకు ముందు ఆయన 2019లో గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు. ఇక ఈసారి కచ్చితంగా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలని గట్టిగా ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన విజయవాడ తూర్పు నుంచి ఈసారి దూరంగా జరిగి పెనమలూరు వైపు వెళ్ళాలని చూస్తున్నారు అని అంటున్నారు. నియోజకవర్గాల మార్పులో పెనమలూరు ఎన్ టీఆర్ జిల్లాలోకి వస్తుంది అని అంటున్న నేపధ్యంలో ఈ యువనేత ఆ సీటు మీదనే ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. మొత్తానికి వైసీపీకి విజయవాడ ఎంపీ సీటు అభ్యర్థి మళ్ళీ ఒక బిగ్ డిస్కవరీగానే మారుతోంది అని అంటున్నారు. అయితే 2029 ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళ కాలం ఉండడంతో చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు.

Tags:    

Similar News