జగన్ అడ్డాలో పవన్ షాక్ ఇవ్వబోతున్నారా ?

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడితే దానికి వచ్చిన రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే.

Update: 2026-06-07 00:30 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెడితే దానికి వచ్చిన రెస్పాన్స్ ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఈ రోజుకీ రాజకీయంగా ఆ ప్రకంపనలు తెలంగాణాను కదిలిస్తూనే ఉన్నాయి. అదే సమయంలో పవన్ చేసిన కామెంట్స్ పట్ల ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అలా తెలంగాణాలో కలకలం రేపిన పవన్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో సరికొత్త హీట్ ని పెంచేందుకు రెడీ అవుతున్నారా అన్న చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ తొలిసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో పులివెందులలో పర్యటించబోతున్నారు.

జగన్ ఇలాకా అంటేనే :

ఇక పులివెందుల అంటే దాదాపుగా యాభై ఏళ్ళ బట్టి వైఎస్సార్ కుటుంబం ఏలుబడిలో ఉంది. అక్కడ నుంచి వైఎస్సార్ ఆరు సార్లు తెలిస్తే జగన్ మూడు సార్లు గెలిచారు. విజయమ్మ సహా ఇతర కుటుంబ సభ్యులు కూడా పులివెందుల నుంచి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. దాంతో పులివెందుల అంటేనే వైఎస్ ఫ్యామిలీ అడ్డా అని ఒక మార్క్ పడిపోయింది. అలాంటి పులివెందులలో రాజకీయ ప్రత్యర్ధులు ఎవరు పర్యటించినా కూడా ఫుల్ ఎటెన్షన్ ఆ వైపే ఉంటుంది. ఇక పవన్ లాంటి చరిష్మా టిక్ లీడర్ అదే విధంగా ఫైర్ బ్రాండ్ పులివెందులలో పర్యటిస్తే మాత్రం ఆ ఊపే వేరే లెవెల్ అని అనాల్సిందే.

అధికార పర్యటనగానే :

ఇక పులివెందులలో పవన్ పర్యటించబోతోంది అధికారికంగానే అని అంటున్నారు. అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే కొన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగానే పవన్ ఏమి మాట్లాడబోతున్నారు అన్నదే చర్చగా ఉంది. పులివెందులలో పవన్ లాంటి నాయకుడు పర్యటిస్తే కచ్చితంగా అది రాజకీయంగా కూడా హైలెట్ అవుతుంది. మరి ఆలాంటి సమయంలో పవన్ జగన్ మీద కామెంట్స్ చేయకుండా ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేయకుండా ఉంటారా అన్నది అంతా ఆలోచిస్తున్నారు.

జగన్ టార్గెట్ గానేనా :

వైసీపీ అధినేత జగన్ అయితే ఇటీవల కాలంలో ఎందుకో పవన్ మీద కామెంట్స్ ఏమీ చేయడం లేదు. అయితే ఈ మధ్యనే రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే ఒక విశ్లేషణ చేస్తూ జగన్ అరెస్టుని పవన్ కోరారాని అమిత్ షా జగన్ లాంగ్ టెర్మ్ ఫ్రెండ్ అని చెప్పారని చెప్పుకొచ్చారు. ఆ మీదట ఆయన కామెంట్స్ ని ఉప సంహరించుకున్నా అవి మాత్రం వేడెక్కించాయి. ఈ రోజుకీ ఆ వేడి అలా కంటిన్యూ అవుతూనే ఉంది. పవన్ తెలంగాణాలో ప్రెస్ మీట్ కూడా దానికి కొనసాగింపే అని కూడా అంటారు. మరి ఇందులో కీలక విషయం జగన్ కి సంబంధించి ఉంది. మరి ఇపుడు దాని మీద ఏమైనా పవన్ తాజా టూర్ లో మాట్లాడుతారా అన్న ఆసక్తి కూడా ఉంది.

మండించే డేగా :

ఇప్పటికే పవన్ తన పార్టీ మీటింగులో ఎవరినో జైలుకు పంపించేందుకు తాను రాజకీయాలు చేయను అని చెప్పేశారు. దాంతో ఆయన ఏమి వ్యాఖ్యలు చేస్తారు అన్నది చూడాలి. ఒకవేళ పవన్ కనుక జగన్ మీద వైసీపీ మీద హాట్ కామెంట్స్ చేసిన పక్షంలో వైసీపీ నేతలు కూడా ఏపీలో దాని మీద రాజకీయ రచ్చకు తయారుగా ఉంటారు అనడంలో సందేహం లేదు. మొత్తానికి ఈ సండే రాజకీయంగా మాటల మంటలను మండించే డేగా మారుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News