• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  68వ అంతస్తు నుంచి పడిన...

68వ అంతస్తు నుంచి పడిన సాహసికుడు!

| అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో ఎక్స్ పర్ట్ గా పేరున్న రెమీ లుసిడి

By - Tupaki Desk
Update: 2023-07-31 08:24 GMT

కొంతమందికి సాహసాలంటే పిచ్చి! సాహస యాత్రలు చేయడం.. పెద్ద పెద్ద పర్వతాలు అధిరోహించడం.. సముద్ర గర్భంలో సెల్ఫీలు తీసుకోవడం.. అత్యంత ఎత్తైన చోట ఫోటోలు దిగడం వంటివి చాలా మంది సాహసికులకు అత్యంత ఇష్టమైన విషయం. అయితే తాజాగా జరిగిన ఒక సాహసం... విషాదంగా ముగిసింది.

అవును... అత్యంత ఎత్తైన భవనాలను అధిరోహించడంలో ఎక్స్ పర్ట్ గా పేరున్న రెమీ లుసిడి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ప్రమాదాలతో చెలగాటమాడటం సరదాగా భావించే 30 ఏళ్ల ఈ ఫ్రాన్స్‌ సాహసికుడు... తాజాగా ఓ సాహసం చేసే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన హాంకాంగ్‌ లో చోటు చేసుకుంది.

వివరాళ్లోకి వెళ్తే... ఫ్రాన్స్‌ కు చెందిన 30 ఏళ్ల సాహసికుడు రెమీ లుసిడి తాజాగా ఒక "ఎత్తైన" నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా హాంకాంగ్‌ లోని ది ట్రెగంటెర్‌ టవర్‌ కాంప్లెక్స్‌ ను అధిరోహించాలని ప్రయత్నించాడు. అనుకున్నట్లుగానే ఈ భవనం 68వ ఫ్లోర్‌ కి చేరుకున్నాడు.

అయితే అలా 68వ ఫ్లోకి చేరుకున్న రెమీ... ఆ ఫ్లోర్‌ లోని పెంట్‌ హౌస్‌ కిటికిబయట చిక్కుకుపోయాడు. దీంతో ఆ కిటికీని బలంగా తన్నాడు. ఆ తర్వాత అతడి కాలు అక్కడి నుంచి పట్టుతప్పింది. దీంతో అంతెత్తునుంచి నేరుగా కిందపడిపోయాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

అయితే అంతకుముందు సోమవారం ఉదయం 6 గంటల సమయంలో భవనం సెక్యూరిటీ వద్దకు వచ్చిన రెమీ లుసిడి... 40వ అంతస్తులో తన మిత్రుడు ఉన్నాడని చెప్పి లోపలకు వెళ్లిపోయాడు. అయితే... 40వ అంతస్తులో సదరు వ్యక్తి, రెమీ ఎవరో తనకు తెలియదని సెక్యూరిటీకి చెప్పాడు. అప్పటికే లుసిడి ఎలివేటర్‌లో పైకి వెళ్లడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలో ఉదయం 7.38 సమయంలో అతడిని 68వ అంతస్తులోని పెంట్‌ హౌస్‌ లో చూసిన పనిమనిషి షాకై.. పోలీసులకు కాల్‌ చేసింది. ఆ సమయంలో కిటికీ బయట చిక్కుకున్న అతడు పట్టుతప్పి కిందపడిపోయాడు. సంఘటనా స్థాలనికి వచ్చిన పోలీసులు... అతడి కెమెరాను స్వాధీనం చేసుకొన్నారు.

Tags:    
  • Daredevil 
  • Frenchstunt 
  • Remienigma 
  • Hongkongtower 
  • Remienigmadeath 
  • Highrisestunts 
  • Stunts 
  • Remienigmastunts 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS