బీసీలపై పట్టు.. కాంగ్రెస్ పక్కా వ్యూహం!
దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోఓబీసీ జపం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని బలంగానే ఎదుర్కొంటామన్న సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.;
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై పట్టు బిగించేలా నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ప్రకటించిన రాజ్యసభ స్థానాలను పరిశీలిస్తే.. బీసీలకు పెద్దపీట వేయడం స్పష్టంగా కనిపిస్తోంది. అదేసమయంలో దేశవ్యాప్తంగా కూడా .. రాజ్యసభ స్థానాలను మెజారిటీ బీసీలకే అప్పగించింది. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోఓబీసీ జపం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీని బలంగానే ఎదుర్కొంటామన్న సంకేతాలు ఇస్తున్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
తెలంగాణ నుంచి..
తెలంగాణలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకటి యాదవులకు కేటాయించింది. వీరు సామాజిక వర్గం పరంగా బీసీ కేటగిరీలో ఉన్నారు. మాజీ ఎంపీ రేణుకాచౌదరి, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. ఇది పార్టీకి మంచి పరిణామంగా మారనుంది. పైగా అనిల్ కుమార్ యువ నాయకుడు కావడం కూడా కలిసిరానుందని అంటున్నారు. ఎన్నికల వేళ.. కాంగ్రెస్ వైపు యువత మొగ్గు చూపే అవకాశం ఉందని చెబుతున్నారు.
కర్ణాటక-మధ్యప్రదేశ్‌ల నుంచి..
కర్ణాటక మధ్యప్రదేశ్‌ల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గాల వారీగా రాజ్యసభ సీట్లను ఖరారు చేసింది. కర్ణాటక నుంచి అజయ్ మాకెన్, సయ్యద్ నాసీర్ హుస్సేన్(మైనారిటీ), జీసీ చంద్రశేఖర్(బీసీ)లను నియమించింది. ఇది వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీకి మేలు చేయడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. ఇక, మధ్యప్రదేశ్ నుంచి అశోక్ సింగ్‌కు చోటు కల్పించింది. ఈయన సీనియర్ నాయకుడు, పైగా ఆయన సామాజిక వర్గంలో గట్టి పలుకుబడి.. ప్రజాదరణ ఉన్న నేత కావడంతో పార్లమెంటు ఎన్నికల్లో ఈ ఈక్వేషన్ కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.