కాంగ్రెస్ నేతకు గుండెపోటు: సీపీఆర్ చేసి కాపాడిన ఎమ్మెల్యే
వివరాల్లోకి వెళితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు భద్రాచలానికి చేరుకున్నారు.;
భద్రాచలంలో ఒక కాంగ్రెస్ నేత గుండెపోటుకు గురికావడం కలకలం రేపింది.. అయితే స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తక్షణమే స్పందించి సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిసస్సిటేషన్) చేయడంతో ఆ నేత ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.
వివరాల్లోకి వెళితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు భద్రాచలానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఒక కాంగ్రెస్ నేత ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. దీంతో అక్కడ ఆందోళన నెలకొంది.
అయితే అక్కడే ఉన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెంటనే స్పందించారు. వైద్యుడిగా కూడా ప్రావీణ్యం ఉన్న ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాంగ్రెస్ నేతకు సీపీఆర్ చేయడం ప్రారంభించారు. ఎమ్మెల్యే చేసిన సకాల చర్యతో ఆ నేత ప్రాణాలు నిలబడ్డాయి. అనంతరం, మెరుగైన చికిత్స కోసం ఆయనను ఆసుపత్రికి తరలించారు.
ఒకవైపు మంత్రి పర్యటన సందర్భంగా సందడిగా ఉన్న సమయంలో, ఇలాంటి సంఘటన జరగడం కలకలం రేపింది. అయితే, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చూపిన మానవత్వం, ఆయన చేసిన తక్షణ సహాయం పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఒక వైద్యుడిగా కూడా ఆయన స్పందించిన తీరు ఆదర్శనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.