అంతా కాషాయమయం...దేశం బీజేపీ వశం !

దేశంలో మూడున్నర దశాబ్దాల పాటు తిరుగు లేకుండా అధికారం చలాయించిన పార్టీ కాంగ్రెస్.;

Update: 2026-05-04 11:30 GMT

దేశంలో మూడున్నర దశాబ్దాల పాటు తిరుగు లేకుండా అధికారం చలాయించిన పార్టీ కాంగ్రెస్. కేంద్రంలోనే కాదు అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. అప్పట్లో ఎక్కడ చూసినా ఖద్దరు పార్టీయే కనిపించేది. పంచాయతీ వార్డు మెమబర్ నుంచి పార్లమెంట్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కాంగ్రెస్ హవాయే సాగింది. కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకుంటేనే రాజ్యాధికారం దక్కేది. కాంగ్రెస్ ని మంచి చేసుకుంటేనే పదవులు లభించేవి. దేశంలో అంతలా అధికారం శ్వాసిస్తూ శాసించిన పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే. ఇపుడు ఆ పార్టీ తరువాత మరో పార్టీగా బీజేపీ నిలిచి గెలుస్తోంది.

ఆ కోరికతోనే :

బీజేపీ ఏర్పాటు ఆ కోరికతోనే అన్నది అందరికీ తెలిసిందే. 1953లో జన సంఘ్ ని డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ స్థాపించడం వెనక కాంగ్రెస్ ని పక్కకు నెట్టి తాము అధికారంలోకి రావాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. అది కాస్తా 1977లో కొంత తీరింది. మధ్యేవాద పార్టీలతో కలసి మొదట్లో తన బలాన్ని పెంచుకున్న బీజేపీ తరువాత కాలంలో ఒంటరిగా ఢీ కొడుతూ వచ్చింది. ఈ క్రమంలో తనక్ అందుబాటులో ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్డీయే కూటమిని కూడా ఏర్పాటు చేసింది. జన సంఘ్ కాలం నుంచి హిందీ బెల్ట్ లో బీజేపీకి పూర్తిగా రాజకీయ హవా ఉంది. ఆ తరువాత తూర్పు పశ్చిమ తీరాలకు దానిని విస్తరించింది. ఈ రోజున ఈశాన్య భారతంతో పాటు తూర్పు భారతం అంతా బీజేపీ చేతిలోకి వచింది. అంగ వంగ కళింగ రాష్ట్రాలు అన్నీ కలమ నీడలోకి వచ్చేసినట్లే అని అంటున్నారు.

కాషాయం కారిడార్ :

బీహార్ నుంచి మొదలుపెడితే సిక్కిం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, అస్సాం, త్రిపుర మీదుగా ఈ రోజున పశ్చిమ బెంగాల్ వరకూ కాషాయం పార్టీ విస్తరణ చాలా వేగంగా దూకుడుగా సాగింది. గట్టిగా చెప్పాలీ అంటే కేవలం పదేళ్ళ కాలంలో ఇదంతా జరిగింది. దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలు అలాగే మిత్రులతో కూడిన రాష్ట్రాలతో దేశం నిండిపోయింది. అంతే కాదు తూర్పు భారతంలో చూస్తే ఒడిసా చత్తీస్ ఘడ్, ఆంధ్ర ప్రదేశ్, పాండిచ్చేరి ఇలా బీజేపీ ఎన్డీయే పాలిత రాష్ట్రాలే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

ఉత్తర భారతంలో సైతం :

మరో వైపు చూస్తే ఉత్తర భారతంలో యూపీ ఉత్తరాఖండ్, హర్యానా ఢిల్లీ వంటివి బీజేపీ ఏలుబడిలో ఉన్నాయి. అలాగే పశ్చిమ భారతంలో చూస్తే కనుక రాజస్థాన్, గుజరాత్ మహారాష్ట్ర, గోవా వంటివి బీజేపీ చేతిలోకి వచ్చేశాయి. దేశం నడిబొడ్డున ఉన్న మధ్య ప్రదేశ్ కూడా గత రెండు దశాబ్దాలుగా బీజేపీ పాలనలోనే ఉంది. ఇలా చూస్తే బీజేపీ దీ దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత రాష్ట్రాల్లో అత్యధికం తన సొంతం చేసుకుంది.

దక్షిణాదినే ఇంకా :

ఈ నేపథ్యంలో బీజేపీకి ఉన్న ఏకైక అసంతృప్తి ఏమిటి అంటే దక్షిణాదిన ఇంకా కమల వికాసం జరగలేదు. తమిళనాడులో టీవీకే రూపంలో విజయ్ అధికారం అందుకోబోతున్నారు. అలాగే కేరళలో కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటక తెలంగాణాలో కాంగ్రెస్ ఉంది. 2028 ఎన్నికల్లో కర్ణాటక తెలంగాణాలను గెలుచుకోవాలని బీజేపీ సౌత్ మిషన్ తో ఉంది. ఇక కేరళ తమిళనాడులో బీజేపీ వికాసం అంటే ఇప్పట్లో కొంచెం కష్టమే అని చెప్పాల్సి ఉంటుంది.

Tags:    

Similar News