గ్రిల్ చికెన్ లో లెగ్ పీస్ లేదు.. హోటల్ కు భారీ ఫైన్

ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ.. తనకు న్యాయం చేయాలంటూ సదరు హోటల్ మీద వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.;

Update: 2025-09-06 08:34 GMT

గ్రిల్ చికెన్ ఆర్ఢర్ చేస్తే.. అందులో లెగ్ పీస్ లేని వైనంపై ఒక వినియోగదారుడికి కోపం వచ్చింది. ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ.. తనకు న్యాయం చేయాలంటూ సదరు హోటల్ మీద వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు. సదరు వినియోగదారుడి దరఖాస్తును విచారణకు స్వీకరించిన ఫోరం.. తాజాగా సదరు రెస్టారెంట్ కు రూ.10వేల ఫైన్ ను.. ఇతర ఖర్చులకు రూ.5వేలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకూ ఇదంతా ఎక్కడ జరిగిందన్న విషయంలోకి వెళితే..

తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన క్రిస్టోఫర్ ఎడిసన్ అనే వ్యక్తి తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి స్థానికంగా ఉండే ఒక హోటల్ (రెస్టారెంట్)కు ఈ ఏడాది జనవరి 14న వెళ్లారు. తమకు కావాల్సిన ఆహార పదార్థాల్ని ఆర్డర్ చేశారు. తందూరి చికెన్.. గ్రిల్ చికెన్ ఆర్డర్ చేయగా.. గ్రిల్ చికెన్ లో లెగ్ పీస్ లేకపోవటాన్ని రెస్టారెంట్ సిబ్బందిని అడిగారు. వారు అందుకు సానుకూలంగా స్పందించకపోగా.. బెదిరింపు ధోరణిలో మాట్లాడారు.

దీంతో.. కుటుంబ సభ్యుల ఎదుట జరిగిన ఈ బెదిరింపులకు తాను మానసిక క్షోభను అనుభవించినట్లుగా పేర్కొంటూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. హోటల్ లో బిల్ రూ.1196 అయ్యిందని.. ఆ మొత్తంతో పాటు తన మానసిక క్షోభకు నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ఫోరం.. సదరు రెస్టారెంట్ యజమానికి రూ.10వేల ఫైన్ తో పాటు.. ఫోరంలో కేసు ఖర్చులకు రూ.5 కలిపి మొత్తం రూ.15 వేలు ఇవ్వాలని ఆదేశించింది

Tags:    

Similar News