దేశమంతా కాక్రోచ్ దండు

కాక్రోచ్ జనతా పార్టీ జోరు చేస్తోంది. నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చేసిన సీజేపీ తాజాగా మహారాష్ట్రలోని పూణేలో మరో భారీ ఆందోళన చేపట్టింది.

Update: 2026-06-11 18:40 GMT

కాక్రోచ్ జనతా పార్టీ జోరు చేస్తోంది. నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ఎత్తున ఆందోళన చేసిన సీజేపీ తాజాగా మహారాష్ట్రలోని పూణేలో మరో భారీ ఆందోళన చేపట్టింది. పెద్ద ఎత్తున విద్యార్థి లోకం హాజరై సంఘీభావం తెలిపినిద్. దాంతో ఇదే క్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో దేశవ్యాప్త నిరసనలకు కార్కోచ్ పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో జూన్ 14న బెంగళూరు హైదరాబాద్‌లలో నిరసన కార్యక్రమాలను నిర్వహించనుంది. హైదరాబాద్‌లో ఆ రోజు నిరసన ఉదయం 10 గంటలకు ధర్మ చౌక్ వద్ద జరగనుండగా బెంగళూరులో సాయంత్రం 4 గంటలకు ఫ్రీడం పార్క్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.

సరిగ్గా పన్నెండు రోజులు :

ఈ నెల 6న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద మొదలైన కాక్రోచ్ పార్టీ ఆందోళన దేశమంతా ప్రధాన నగరాలలో సాగి తిరిగి ఈ నెల 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగుస్తుంది. ఇదే క్రమంలో జూన్ 12న లక్నోలో జూన్ 13న అమృత్‌సర్‌లో సీజేపీ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక సీజేపీ నిరసనలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు వారి తల్లిదండ్రులు పాల్గొని ప్రశ్నపత్రాల లీకేజీ మీద గళం విప్పుతున్నారు. అంతే కాదు సీబీఎస్ఈ ఆన్‌లైన్ స్క్రీన్ మార్కింగ్ విధానం మీద భారతదేశం విద్యా విధానం మీద తమ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు.

నిరవధిక నిరసనగా :

ఇదిలా ఉంటే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే జూన్ 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ నిరవధిక నిరసన దీక్షను ప్రారంభిస్తామని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ డిప్కే తెలిపారు. తాము దేశ విద్యా విధానం మీద తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నామని అంతకు ముందు అభిజీత్ డిప్కే విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ తప్పుని అంగీకరిస్తూ సాధారణ రాజీనామాకు తాము డిమాండ్ చేస్తామని కానీ దానికి అంగీకరించడానికి వారు సిద్ధంగా లేకపోతే విద్యా వ్యవస్థను సరిదిద్దుతారని మనం ఎలా ఆశించగలమని అభిజిత్ దీప్కే ప్రశ్నించారు. ఎవరైనా తప్పును అంగీకరించడంతోనే మార్పు మొదలవుతుందని అన్నారు. ఇక విద్యాపరమైన సమస్యలపై యువతకు విజ్ఞప్తి చేస్తూ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తానని కూడా ఆయన ప్రకటించారు.

వారికి పన్నెండేళ్ళు ఇచ్చారు :

ఈ రోజు దేశాన్ని ఏలుతున్న వారికి పన్నెండేళ్ళు ఇచ్చారని, విద్యార్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి తమకు 12 రోజులు సమయం ఇవ్వాలని ఆయన కోరడం విశేషం. సీజెపేఎ తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వండని ఆయన విద్యార్ధులను కోరారు. నీట్ యూజీ లీక్ సీబీఎస్ఈ మూల్యాంకన సమస్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని సీజేపీ అంటోంది.

నేను ఉద్యోగం కోసం :

దేశంలో నీట్ పరీక్షా పత్రం లీక్ ఘటన సమయంలో తాను అమెరికాలో ఒక ఉద్యోగం కోసం దరఖాస్తు చేసే పనిలో ఉన్నాను అన్నారు. అక్కడ తాను సంతోషంగానే ఉన్నాను. కానీ దేశంలోని యువత కోసమే సీజేపీని ప్రకటించాల్సి వచ్చింది అన్నారు. దానికి లభించిన స్పందన అయితే తనకు ఎంతగానో ఉత్సాహం ఇచ్చిందని అందుకే తాను వెనక్కి వచ్చి దేశంలో పోరాటం చేస్తున్నాను అని అభిజిత్ దీప్కే చెప్పారు. సీజేపీ అనుచరులలో సగం మంది పాకిస్థానీలేనని బీజేపీ మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు, దానికి బదులుగా నేను అనుచరుల వివరాల స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశానని, అందులో 94.5 శాతం మంది భారతీయులేనని తేలిందని ఆయన చెప్పారు.

అలా ఎందుకు పిలుస్తున్నారు :

తాము సమస్యల మీద పోరాడితే వారిని పాకిస్తానీయులు అని ఎందుకు పిలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. సీబీఎస్ఈ విద్యార్థులు పాకిస్తానీయులు అవుతారా అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు పాకిస్తానీయులుగా ముద్ర వేస్తారా తాను దేశానికి ముప్పు అని అంటున్నారని మరి మరి అసలైన భారతీయులు ఎవరో చెప్పాలని ఆయన కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు. తమ ఆందోళన కోనసాగి తీరుతుందని అన్నారు.

Tags:    

Similar News