• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సోషల్ సైకోలకు చంద్రబాబు...

సోషల్ సైకోలకు చంద్రబాబు హెచ్చరిక.. ఆడబిడ్డలను ట్రోల్ చేస్తే అదే చివరి రోజంటూ వార్నింగ్

| సోషల్ మీడియాలో విచ్చలవిడి పోస్టింగులతో చెలరేగిపోతున్న సైకోలకు ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

By - Tupaki Desk
Update: 2025-04-11 10:02 GMT

సోషల్ మీడియాలో విచ్చలవిడి పోస్టింగులతో చెలరేగిపోతున్న సైకోలకు ఏపీ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా నేరస్థులకు అడ్డాగా మారిపోతోందని వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనలో చండశాసనుడిని చూస్తారంటూ హెచ్చరించారు. ఎవడైనా సరే ఆడబిడ్డల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరి రోజు అవుతోందని ఘాటుగా హెచ్చరించారు సీఎం చంద్రబాబు. మాజీ సీఎం జగన్ భార్య వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో చేబ్రోలు కిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన నేపథ్యంలో సీఎం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

సోషల్ మీడియా సైకోలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన సహజ శైలికి భిన్నంగా మాట్లాడారు. ఎప్పుడూ శాంతంగా ఉండే చంద్రబాబు తనలో చండ శాసనుడిని తట్టి లేపొద్దంటూ వార్నింగ్ ఇవ్వడం వైరల్ అవుతోంది. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఏలూరు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు, కుల వృత్తిదారుల ఇళ్లకు వెళ్లారు. అనంతరం ప్రజావేదిక నిర్వహించి ప్రజలతో ముఖాముఖిగా ముచ్చటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ప్రస్తావనకు రావడంతో కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

‘‘ఇటీవల కాలంలో సోషల్ మీడియాను ఉపయోగించి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వేధింపులకు గురిచేస్తున్నారు. ఆడబిడ్డలపై ఇష్టానుసారం పోస్టింగులు పెట్టేవారికి అదే చివరి రోజు అవుతుందని గుర్తించుకోండి. సోషల్ మీడియా నేరస్థుల అడ్డాగా మారిపోయింది. ఎవడైనా సరే మహిళలపై తప్పుడు ప్రచారం, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే అదే చివరి రోజు అవుతుంది’’ అంటూ సీఎం వార్నింగ్ ఇవ్వడం ఆకట్టుకుంది. మాజీ సీఎం జగన్ సతీమణిపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన తన పార్టీ కార్యకర్తను అరెస్టు చేయించిన చంద్రబాబు.. మొత్తం సోషల్ మీడియాను ప్రక్షాళించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేస్తే తన వాళ్లైనా శిక్ష అనుభవించాల్సిందేనని సంకేతాలిస్తూ, ఇకపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన వైఖరి ఉంటుందని తేల్చిచెప్పారు.

Tags:    
  • ChandrababuNaidu 
  • SocialMediaAbuse 
  • StopTrolling 
  • APCMWarning 
  • CyberCrime 
  • YSBharathi 
  • WomenSafetyOnline 
  • TDPLeadership 
  • AndhraPolitics 
  • AndhraPradesh 
  • PoliticalNews 

Similar News

జైలు - బెయిల్ రాజకీయాల కోసం పొత్తు పెట్టుకోలేదు: వైసీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు

2026-11-22 12:30 GMT

బండి సంజయ్ టార్గెట్ నెరవేరుతుందా? అసలు గురి 2028 ఎన్నికలేనా?

2026-11-22 11:36 GMT

టెన్షన్ ఎందుకు...లైట్ తీస్కో బ్రో !

2026-11-22 11:35 GMT

ఇమ్మిగ్రేషన్ అధికారుల దుర్మార్గం.. ఫ్లైట్ ఎక్కుతుండగా లాక్కేళ్లారు.. కూతురి ఆర్తనాదాలు వైరల్

2026-11-22 11:34 GMT

టీమిండియాలో సిరాజ్ కు దక్కని చోటు.. సెలెక్షన్ చుట్టూ రాజకీయ దుమారం..

2026-11-22 11:28 GMT

జగన్ లాంటి మనస్తత్వం ఎవరికి లేదు.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

2026-11-22 11:24 GMT

బాండ్ పేపర్లు.. రూ.కోట్ల ఆఫర్లు : పంచాయతీ ఎన్నికల్లో హామీల జాతర

2026-11-22 11:20 GMT

వరుణుడా.. మజాకా.. చలికాలంలోనూ తుఫాన్ల వెబ్ సిరీస్.. క్లైమాక్స్ ఎప్పుడో?

2026-11-22 10:55 GMT

అవెంజర్స్: ఎండ్‌గేమ్ రికార్డును బద్దలు కొట్టిన GTA 6.. ఒక్క రోజులోనే రూ. వేల కోట్ల వసూళ్లు!

2026-11-22 10:33 GMT

రూ.800 కోట్ల కలల సాకారం.. ఐఐటీ క్లాస్‌రూమ్ నుంచి మెటా సూపర్ ఇంటెలిజెన్స్ వరకు ఓ భారతీయుడి అద్భుత ప్రస్థానం

2026-11-22 04:34 GMT

పుష్క‌రాల‌కు మోడీ వ‌స్తున్నారు.. ఏర్పాట్లు అద‌రాలి: చంద్ర‌బాబు

2026-11-22 04:32 GMT

టెస్టు క్రికెట్‌లో టీమ్‌ఇండియా విధ్వంసం.. రికార్డులన్నీ బద్దలు.. పంత్‌ ఖాతాలో అరుదైన ఘనత

2026-11-22 04:32 GMT

Copyright @2026

Powered by Blink CMS