రైస్ తినడం మానేశా....బాబు చెప్పిన ఆరోగ్య రహస్యం

తాను రైస్ తినడం మానేశాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అలా ఎందుకు చేశానో కూడా ఆయన జనాలకు వివరించారు.;

Update: 2025-12-04 03:17 GMT

తాను రైస్ తినడం మానేశాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అలా ఎందుకు చేశానో కూడా ఆయన జనాలకు వివరించారు. నల్లజర్లలో జరిగిన రైతన్న మీ కోసం ప్రజా వేదిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ చాలా ఆసక్తికరమైన విషయాలను ప్రజలతో పంచుకున్నారు. ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక వైద్యునిగా ఒక ఆరోగ్య సలహాదారునిగా ఆయన అవతారం ఎత్తారు. ప్రజలకు ఆరోగ్యపరంగా చైతన్యపరచే ఎన్నో విషయాలను బాబు ఈ సందర్భంగా చెప్పడం విశేషం.

ఆరోగ్య దార్శనికుడిగా :

చంద్రబాబు అంటే అభివృద్ధికి నమూనా అంటారు. ఆయనని విజనరీగా కూడా పిలుస్తారు. అయితే బాబు కేవలం అభివృద్ధి విషయంలోనే కాదు ఆరోగ్యం విషయంలోనూ ఎంత శ్రద్ధ పెడతారు ఏ విధంగా జాగ్రత్తలు పాటిస్తారు అన్నది ఆయన తాజా ప్రసంగంలో వెల్లడి అయింది తాను రైస్ తినడం మానేశాను అని బాబు చెప్పినపుడు జనాలు ఆశ్చర్యానికి గురి అయ్యారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో దాని వల్ల కలిగే లాభాలు ఏమిటో కూడా బాబు వివరించారు.

మధుమేహానికి గేట్ వే :

ఈ రోజులలో చాలా మందికి సుగర్ వ్యాధి ఈజీగా వస్తోంది. దానికి కారణాలు ప్రధానంగా ఆహారపు అలవాట్లుగానే చెబుతారు. ముఖంగా సుగర్ పేషంట్లను బియ్యం తో చేసిన ఆహారం తినవద్దని సూచించారు. బాబు ఇదే విషయం చెబుతూ రైస్ ని ఎంత తక్కువగా తింటే అంత ఆరోగ్యానికి మంచిది అని అన్నారు. బియ్యం తినడం అంటే సుగర్ కి ద్వారాలు తెరచినట్లే అని కూడా చెప్పారు. గతంలో చూస్తే కనుక గోదావరి జిల్లాలలో ప్రజల ప్రధాన ఆహారంగా బియ్యం ఉండేదని, రాయలసీమ వసులు రాగులు జొన్నలు ఎక్కువగా తినేవారని బాబు గుర్తు చేశారు.

అప్పటి నుంచే అలా "

అయితే చిరుధాన్యాలు తిన్నంత సేపూ ప్రజలకు మధుమేహం వ్యాధి రాలేదని అన్నారు. కానీ ఇపుడు రాయలసీమ వాసులు కూడా బియ్యం తినడం వల్ల అక్కడ సుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ అయ్యారని బాబు చెప్పుకొచ్చారు. వారంతా ఆ వ్యాధిన బారిన పడుతున్నారని అన్నారు. ఆహారపు అలవాట్లు మారిపోవడం వల్లనే ఈ పరిస్థితి అని ఆయన అన్నారు.

మిగిలినవన్నీ కూడా :

ఒక్కసారి సుగర్ వ్యాధి వచ్చింది అంటే కనుక నెమ్మదిగా ఇతర వ్యాధులు కూడా వస్తాయని బాబు చెప్పారు. అది చివరికి కిడ్నీల ఫెయిల్యూర్ కి కూడా దారి తీస్తుందని ఆయన అన్నారు. ప్రపంచంలో అది ప్రధాన వ్యాధులలో మొదటి స్థానంలో సుగర్ ఉందని బాబు గుర్తు చేశారు. అదే విధంగా రక్తపోటు వ్యాధి కూడా ఆరోగ్యాన్ని దెబ్బ తీసేదే అని ఇది కూడా జీవన శైలి మీద ఆధారపడి వచ్చే వ్యాధిగా ఆయన పేర్కొన్నారు.

ఇదే ఆరోగ్య సూత్రం :

ఇక తాను ఆరోగ్యంగా ఉన్నాను అంటే బియ్యం తినకపోవడం వల్లనే అని బాబు చెప్పారు. తాను మరిన్ని పనులు చేయాలీ అంటే ఆరోగ్యంగా ఉండాలని అందుకే రైస్ తినకుండా మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నాను అని బాబు చెప్పారు. ఎవరికైనా ఆరోగ్యం అన్నది చాలా ముఖ్యమైనదిగా బాబు చెప్పారు. దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

త్వరలో సంజీవని యాప్‌ :

ఇదిలా ఉంటే రాష్ట్రంలో త్వరలో సంజీవని యాప్‌ ని ప్రవేశపెడతామని బాబు చెప్పారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించడమే కాకుండా వాటికి తగిన మందులను కూడా సూచిస్తూ అందించే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. ఇక బియ్యం తక్కువ తినడం అంతా అలవాటు చేసుకోవాలని బాబు సూచించరు. దాని వల్ల అనేక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని చెప్పారు. ఒక వయసు వచ్చిన తరువాత ఆరోగ్యంగా ఉండాలీ అంటే బియ్యాని దూరం పెట్టాల్సిందే అని బాబు చెప్పడం విశేషం. మొత్తానికి బాబు ఆరోగ్య సూత్రాలు అయితే అందరిలోనూ ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.

Tags:    

Similar News