రాజ్యాంగం 'ప‌ర్మినెంట్ బుక్' కాదు: జ‌స్టిస్ గ‌వాయ్ కీల‌క వ్యాఖ్య‌లు

దేశంలో రాజ్యాంగంపై తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.;

Update: 2025-11-16 16:30 GMT

దేశంలో రాజ్యాంగంపై తీవ్ర స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతున్న నేప‌థ్యంలో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ''మోడీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తారు. బీహార్‌లో ఎన్డీయే గెలిస్తే.. రాజ్యాంగం సంపూర్ణంగా మారిపోతుంది.'' అంటూ.. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్ర‌చారం దేశ‌వ్యాప్తంగా దుమారం రేపింది. అయితే.. తాము విధి విధానాల‌కు క‌ట్టుబ‌డ‌తామ‌ని.. బీజేపీ అగ్ర‌నాయ‌కులు కౌంట‌ర్ ఇచ్చారు. ఈ చ‌ర్చ ఇంకా కొన‌సాగుతూనే ఉంది.

ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గ‌వాయ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల నంగా మారాయి. రాజ్యాంగం ఏమీ ప‌ర్మినెంట్ బుక్‌(శాస్వ‌త పుస్తకం/ స్థిర‌మైన ప‌త్రం) కాద‌ని వ్యాఖ్యానిం చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. అయితే.. దీనికి కొన్ని కొల‌మా నాలు ఉంటాయ‌ని చెప్పారు. వాటిని పాటిస్తూ..రాజ్యాంగాన్ని ఎన్నిసార్ల‌యినా.. మార్చుకునే స్వేచ్ఛ రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ మ‌న‌కు క‌ల్పించార‌ని చెప్పారు.

అయితే.. కొన్ని కొన్ని విష‌యాల్లో రాజ్యాంగాన్ని చాలా సాధార‌ణంగా స‌వ‌రించుకునే అవ‌కాశం ఉండ‌గా.. మ‌రికొన్ని సంద‌ర్భాల్లో మాత్రం.. ప్ర‌క్రియ‌ క‌ఠినంగా ఉంటోంద‌నిచెప్పారు. అంతేకాదు.. రాజ్యాంగాన్ని ఆ మోదించుకున్న మ‌రుస‌టి రోజే స‌వ‌రించుకున్న విష‌యాన్నిఈ సంద‌ర్భంగా జ‌స్టిస్‌గ‌వాయ్ గుర్తు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న చ‌ర్చ నేప‌థ్యంలో అత్యంత ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఇక‌, ప్రాధ‌మిక హ‌క్కుల‌తో పాటు రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల‌కు కూడా స‌మాన ప్రాధాన్యం ఉంద‌ని ఆయ‌న తెలిపారు.

Tags:    

Similar News