అక్క‌డ వైసీపీని క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతున్నారా..?

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో ఏం జ‌రుగుతోంది? ఇక్క‌డ రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? అనేది ఆస‌క్తిగా మారింది;

Update: 2025-07-17 03:15 GMT

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత జిల్లా చిత్తూరులో ఏం జ‌రుగుతోంది? ఇక్క‌డ రాజ‌కీయాలు ఎలా ఉన్నాయి? అనేది ఆస‌క్తిగా మారింది. దీనికికార‌ణం.. ఇత‌ర జిల్లాల్లో .. వైసీపీ హ‌వా ను త‌గ్గించేందుకు టీడీపీ నాయకులు స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నారు. వీరు చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా ఫ‌లిస్తున్నాయి. దాదాపు సగం జిల్లాల్లో వైసీపీ మాట వినిపించ‌డం లేదు. నాయ‌కులు కేసుల భ‌యంతో బ‌య‌ట‌కు కూడా రావ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఉత్త‌రాంధ్ర‌లోని విశాఖ‌, శ్రీకాకుళం, తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి, ఎన్టీఆర్‌, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

ఈ క్ర‌మంలో చిత్తూరులో ప‌రిస్థితి ఎలా ఉంది? అనేది కీల‌కంగా మారింది. ఇక్క‌డ కాస్త భిన్న‌మైన వాతావర ణం క‌నిపిస్తోంది. అదును చూసుకుని వైసీపీ నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మిగిలిన రోజుల్లో మౌనంగా ఉంటున్నారు. ఇటీవ‌ల బంగారుపాళ్యంలో జ‌గ‌న్ ప‌ర్య‌టించిన‌ప్పుడు ఎక్క‌డెక్క‌డ నుంచో నాయ కులు క్యూ క‌ట్టారు. ఆ త‌ర్వాత‌.. అంతా సైలెంట్ అయ్యారు. ఇక‌, చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో అస‌లు వైసీపీ జెండా క‌నిపించ‌డం లేదు. తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోని తిరుప‌తి అసెంబ్లీలో నూ వైసీపీ జాడ క‌నిపించ‌డం లేదు.

అలాగ‌ని నాయ‌కులు లేక‌పోవ‌డం కాదు. ఉన్నారు. అయితే.. అవ‌కాశం కోసం.. ఎదురు చూస్తున్నారు. ఇత‌ర జిల్లాల్లో అయితే.. అస‌లు అవ‌కాశం వ‌చ్చినా వారు ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. చిత్తూరుకు, ఇత‌ర జిల్లాల‌కు తేడా ఉంది. ఇక్క‌డ బ‌ల‌మైన పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వ‌ర్గం ఉంది. ఆయ‌న కూడా దూకుడుగానే ఉన్నారు. ఈ ప‌రిణామంతో చిత్తూరులో ఎంత నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నా.. టీడీపీ ప్ర‌య‌త్నాలు అనుకున్నంత విధంగా ముందుకు సాగడం లేదు. అంతేకాదు.. ఏదో ఒక సందర్భం లో వైసీపీ నాయ‌కులు దూకుడు చూపిస్తున్నారు.

ఎంపీ సీటుతో పాటు.. పుంగ‌నూరు వంటి బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఉండ‌డంతోపాటు.. స్లీప‌ర్ సెల్స్ మాదిరిగా జ‌గ‌న్ అంటే.. అభిమానం ఉన్న నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్నారు. ఇత‌ర జిల్లాల్లోనూ ఇలా ఉన్నా.. వారికి .. చిత్తూరు జిల్లాకు తేడా ఉంది. ఈ క్ర‌మంలోనే.. రాష్ట్రంలో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. చిత్తూరు జిల్లాలో మాత్రం భిన్న‌మైన రాజ‌కీయ వాతావ‌ర‌ణం నెల‌కొంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రోవైపు.. అభివృద్ధి పేరుతో ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. అంటే.. రాజ‌కీయాంగానే కాకుండా.. అభివృద్ధి రూపంలో కూడా.. ఇక్క‌డ వైసీపీని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది. కానీ.. అనుకున్న విధంగా అయితే.. క‌ట్ట‌డి సాధ్యం కావ‌డం లేద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.

Tags:    

Similar News