కుడి చేతిన పుతిన్.. ఎడమ చేతిన కిమ్.. చైనా అధినేత వెంట 26 దేశాధినేతలు
తాను టార్గెట్ చేసిన దేశాల్ని ఎంతలా ఇబ్బంది పెడుతుందో అన్న దానికి నిదర్శనంగా డ్రాగన్ దేశం చైనా నిలుస్తోంది.;
తాను టార్గెట్ చేసిన దేశాల్ని ఎంతలా ఇబ్బంది పెడుతుందో అన్న దానికి నిదర్శనంగా డ్రాగన్ దేశం చైనా నిలుస్తోంది. చరిత్రలో కొన్ని దశాబ్దాల క్రితం చోటు చేసుకున్న రెండో ప్రపంచ యుద్ధంలో సాధించిన విజయాన్ని సంబరంగా చేసుకునేందుకు చైనా ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించింది. ఈ కార్యక్రమం జపాన్ మీద సాధించిన విజయానికి చిహ్నంగా నిలుస్తోంది. అయితే.. కార్యక్రమానికి హాజరు కావొద్దని తన మిత్రదేశాల్ని జపాన్ కోరింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు.
మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం హాజరు కాలేదు. అయితే.. అందుకు భిన్నంగా అమెరికా అంటేనే నిప్పులు చెరిగే కొన్ని దేశాల ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావటం గమనార్హం. అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు నిత్యం సిద్ధంగా ఉండే రష్యా అధినేత పుతిన్ తో పాటు.. దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ ఉన్నారు.
చైనా రాజధాని బీజింగ్ లోని ప్రఖ్యాత తియాన్మెన్ స్క్రేర్ కూడలి మీదుగా నిర్వహించిన భారీ ఆయుధ వ్యవస్థల పరేడ్ కార్యక్రమానికి 26 దేశాల అగ్రనేతలతో కలిసి చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హాజరయ్యారు. 80వ విక్టరీ డే పరేడ్ కు వచ్చే వేళ.. చైనా అధ్యక్షుడికి కుడివైపున పుతిన్ నిలిస్తే.. ఎడమ చేతి వైపు కిమ్ ఉన్నారు. వీరితో పాటు..ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్.. బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో.. ఇండోనేషియా అధ్యక్షుు ప్రబోబో సుబియంతో.. కాంబోడియా రాజు నోరోడోమ్ సిహమోనీ.. వియత్నాం అధ్యక్షుడు లూంగ్ కూంగ్.. మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం.. మయన్మార్ సైనిక నేత సీనియర జనరల్ మిన్ ఆంగ్ లాంగ్.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్.. కజకిస్తాన్ అధ్యక్షుడు కాసిం జోమార్త్ తొకయేవ్.. జింబాబ్బే అధ్యక్షుడు ఎమర్సన్ నాంగాగ్వా.. కాంగో అధినేత డెనిస్ నసూ ఎన్ గిసో.. క్యూబా అధ్యక్షుడు మేగేల్ డియాజ్ క్యానెల్.. అజర్ బైజార్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ లు హాజరయ్యారు.
మొత్తంగా తన రక్షణ సత్తాను చాటిన ఈ కార్యక్రమానికి తన మిత్రదేశాల అధినేతలు.. అగ్రనేతలు హాజరయ్యేలా చేసిన చైనా వైనం ఆసక్తికరంగా మారింది. అగ్రరాజ్య అమెరికాకు బద్ధ శత్రువులుగా వ్యవహరించే ముఖ్యదేశాల్ని మిస్ కాకుండా చైనా ప్లానింగ్ చూస్తే.. విక్టరీ డే వేళ అమెరికాను వ్యతిరేకించే దేశాధినేతల్ని తన వెంట పరేడ్ కు తీసుకురావటం చూసినప్పుడు అగ్రరాజ్యానికి తానేమీ తీసిపోనన్న సందేశాన్ని చైనా ఇచ్చినట్లుగా చెప్పాలి. మరోవైపు ఈ పరేడ్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ దూరంగా ఉండటం గమనార్హం.
నిజానికి ఈ కార్యక్రమానికి హాజరు కావొద్దంటూ భారత్ ను జపాన్ కోరింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ట్రంప్ తీరుతో తన వ్యూహాత్మక మిత్రుల ఎంపికలో తాత్కాలిక మార్పులు చేపట్టిన మోడీ.. ఈ పరేడ్ కు ముందు చైనా అధినేతను కలిశారే తప్పించి.. డ్రాగన్ దేశంతో అంటకాగే ఉద్దేశం తమకు లేదన్న సందేశాన్ని మోడీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చైనాతో తాను మరీ పూసుకురాసుకు తిరిగే అంశాన్ని పక్కన పెట్టి.. భారతప్రత్యేకతను మోడీ మరోసారి అందరికి అర్థమయ్యేలా చేశారని చెప్పకతప్పదు.